వరంగల్ కార్పొరేషన్ లో టిఆర్ఎస్ క్లీన్ స్వీప్ ఖాయం -మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

 


మొన్నటి ఎమ్మెల్సి ఎన్నికల ప్రజల తీర్పు ప్రతిపక్షాల గూబ గుయ్యిమనిపించాయని ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలతో ప్రతిపక్షాలు అడ్రస్ గల్లంతు అవడం ఖాయమని  టిఆర్ఎస్ -కేసీఆర్ జోలికి పోవద్దని ప్రతిపక్షాలకు గుణపాఠం వచ్చేలా  ప్రజలు తీర్పు ఇవ్వ బోతున్నారని రాష్ట్ర పంచాయితి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

 అన్ని సర్వేలలో జిహెచ్ఎంసి పరిదిలోని 66 డివిజన్లను టిఆర్ఎస్ క్లిన్ స్వీప్ చేయబోతున్నదని తేలిపోయిందని  అయినంత మాత్రాన ఈ ఎన్నికలను అషామాషిగా తీసుకోవద్దని  ఛాలెంజ్ గా తీసుకుని పనిచేయాలని అన్నారు.

 హసన్ పర్తి లోని కెఎల్ఎన్  గార్డెన్స్ , హన్మకొండలోని  మయూరి గార్డెన్స్ లో జిహెచ్ఎంసి  పరిదిలోని 66 డివిజన్ల టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీలతో మంత్రి  సమీక్ష సమావేశాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రులు  మాట్లాడుతూ...జి డబ్ల్యు ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ తో గెలుస్తుందన్నారు. ఈ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేసి అన్ని డివిజన్ల అభ్యర్థులను బంపర్ మెజార్టీ తో గెలిపించడానికి శాయ శక్తుల కృషి చేయాలన్నారు. ఈ పది రోజులు తామే అభ్యర్థుల లాగా మిషన్ మోడ్ లో పని చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు అసలు చోటే లేదని అన్నారు. వాళ్లకు డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు. అన్ని డివిజన్లలో ప్రతి ఓటర్ ను కలిసి మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిద్దామ్. ప్రతిపక్షాల బండారాన్ని బయట పెడదాం. ముఖ్యంగా బీజేపీ అబద్ధాలు, అసత్యాల ప్రచారాలను తిప్పి కొట్టాలని మంత్రులు చెప్పారు. జిడబ్ల్యు ఎంసి ని అభివృద్ది చేసేది, చేస్తున్నది టిఆర్ఎస్  పార్టీ యే నని ప్రజలు నమ్ముతున్నారు. అందరి కృషి వల్ల జి డబ్ల్యు ఎంసి పార్టీ జిడబ్ల్యు ఎంసి  ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేస్తుందని స్పష్టం చేశారు.

మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్ హాజరై నేతలకు దిశా నిర్దేశం చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ చీప్ దాస్యం వినయ్ బాస్కర్, పలువురు  ఎంఎల్ ఏలు , ఇతర ప్రజాప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు