కెసిఆర్ కు కరోనా పాజిటివ్ - మాజి ప్రధాని కి సైతం పాజిటివ్


తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. కెసిఆర్ కు  మైల్డ్ సింప్టమ్స్ ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.  ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సోమవారం ప్రెస్‌ నోట్ రిలీజ్ చేశారు.హోం ఐసోలేషన్ లో ఉండాలని వైద్యులు చేసిన సూచన మేరకు  కెసిఆర్ ఫాం హవుజ్ లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయనకు జ్వరం తగ్గిందని ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణ లో ఉన్నారని తెలిపారు.
కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుండి ముఖ్యమంత్రి  బయట ఎక్కడా కార్యక్రమాల్లో పాల్గొన లేదు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో భాగంగా హాలియాలో ఎన్నికల ప్రచారం ముగింపు రోజు ఆయన పాల్గొన్నారు. ఉప ఎన్నికల్లో పోటి చేస్తున్న అభ్యర్థి నోముల భగత్ తో పాటు అనేక మంది టిఆర్ఎస్ నేతలకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ జరిగింది. ముఖ్యమంత్రి కి హాలీయా సభలో కరోనా సోకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచారంలో  పాల్గొన్న కాంగ్రేస్, బిజెపి,టిఆర్ఎఎస్ నేతలు అనేక మంది కరోనా భారినపడ్డారు.
ఎన్నికల బందోబస్తు నిర్వహించిన పోలీసు సిబ్బంది తో పాటు కొందరు అధికారులు కూడ కరోనా భారిన పడ్డారు.

మాజి ప్రధాన మంత్రి మన్ మోహన్ సింగ్ కు పాజిటివ్

 మాజి ప్రధాన మంత్రి డాక్టర్ మన్ మోహన్ సింగ్ కూడ కరోనా భారిన పడ్డారు. కరోన పరీక్షల్లో మన్ మోహన్ కు పాజిటివ్ గా తేలడంతో వైద్యుల సూచన మేరకు ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిమితంగానే ఉందని వైద్యులు తెలిపారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు