కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున సహాయం

 ఆదుకోనున్న  తెలంగాణ  మీడియా అకాడమి కరోనాతో చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించారు. జర్నలిస్టులను  ఆదు కోవాలని  తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం ( టిజేఎఫ్) నేతలు మారుతి సాగర్, ఇస్మాయిల్, రమణ కుమార్ తో పాటు  పలు జర్నలిస్టు సంఘాల నేతలు  చేసిన విజ్ఞప్తుల  మేరకు  రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ ఆర్థిక సహాయం ప్రకటించారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2లక్షల తక్షణ సహాయం కింద 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందచేసి అదు కోనున్నట్లు తెలిపారు.  అట్లాగే కరోనా భారి పడిన 200 మంది జర్నలిస్టులకు వైద్య చికిత్స ఖర్చల కోసం ఆర్థిక సహాయం చేయనున్నట్లు తెలిపారు.  కరోనా భారిన పడి చికిత్స పొందుతూ  జర్నలిస్టులు చనిపోవడం చాలా భాదాకరమని అల్లం నారాయణ అన్నారు.  జర్నలిస్టుల మరణంతో వారి కుటుంబాలతో పాటు  సమాజం కూడ నష్ట పోయిందని వారు లేని లోటు తీర్చలేమని అన్నారు.  వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన తక్షణ అవసరాన్ని గుర్తించి చనిపోయిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అంద చేయాలని నిర్ణయించామని తెలిపారు. 

సహాయం కోసం మే 10 వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని అల్లం నారాయణ సూచించారు. రాష్ట్రంలో కరోనా భారిన పడిన 2 వేల కు పైగా జర్నలిస్టులకు  ఇప్పటికే మీడియా అకాడమి  ద్వారా 3.5 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అంద చేసారు.  జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించేందుకు  తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ 100 కోట్ల నిధిని ప్రకటించారు. మీడియా అకాడమీకి సుమారు 35 కోట్ల వరకు నిధులు విడుదల చేసారు. ఈ నిధుల  డిపాజిట్ల నుండి  సమకూరే వడ్డీ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ నిధులు నుండే ఇప్పుడు కరోనా భారిన పడిన జర్నలిస్టులకు సహాయం చేస్తున్నారు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు