రెండో రోజుకు చేరిన ఎమ్మెల్యే సీతక్క దీక్ష - భగ్నం చేసిన పోలీసులు

 కరోనా ట్రీట్ మెంట్ ను అరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ 
రెెండు రోజులుగా కటిక నేలపై కొనసాగిస్తున్న దీక్ష
రోడ్డుపైనే దోమలు కుడుతున్నా  నిద్ర
అసలు దీక్ష అంటే ఏమిటో  చూపిన సీతక్క

 


కరోనా ట్రీట్ మెంట్ ను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తు కాంగ్రేస్ పార్టి జాతీయ నాయకురాలు ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూర్య - సీతక్క ఇందిరా పార్కు వద్ద చేపట్టిన  ఆమరణ  దీక్ష మంగళవారం నాటికి  రెండో రోజుకు చేరింది. రెండు రోజులుగా ఆమె దీక్ష లో ఉండడంతో బాగా నీరసించి పోయారు. పల్స్ రేట్ బాగా పడి పోయింది. షుగర్ లెవల్స్ కూడ పడిపోయాయని వైద్య పరీక్షలు నిర్వహించి నిర్దారించారు. దీక్ష విరమించాలని ఎమ్మెల్యే సీతక్కకు విజ్ఞప్తి చేయగా అందుకు ఆమె నిరాకరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా హామి ఇచ్చే వరకు దీక్ష విరమించేది లేదని ఆమె స్పష్టం చేసారు.

ఓ వైపు కరోనా కేసులు పెరిగి జనం పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం అవేవి పట్టించు కోక ఎన్నికలపై ధ్యాస పెట్టిందన్నారు. సీతక్కకు మద్దతుగా ఎన్ఎస్యు ఐ నాయకులు పలువురు దీక్షలో కుర్చున్నారు. రెండు రోజులుగా టెంటు కూడ లేక ఎండలో వారు దీక్షలు కొనసాగిస్తున్నారు. రాత్రి అక్కడే దోమలు కుడుతున్నా రోడ్డుపైనే నిద్రించారు. 

మైకులు లేవు.. పరుపులు . మెత్తటి దిండ్లులేవు.. ఎసీలు..కూలర్లు... అఁతకూ లేవు..కనీసం ఒంటిపై కప్పుకునేందుకు ఓ దుప్పటి లాంటిది కూడ లేదు. కటిక నేలపై ఓ కార్పెట్ వేసి దానిపై దీక్షలు కొనసాగిస్తున్నారు. షర్మిల దీక్షకు పోటెత్తిన మీడియా సీతక్క దీక్షకు ముకం చాటేసింది. షర్మిల దీక్ష శిబిరం ఎదురుగా  పెద్ద పెద్ద స్టాండ్లు పెట్టి జూమ్ లెన్సులు అమర్చుకుని కనిపించిన మీడియా సీతక్క దీక్షలో జాడ లేదు. అత్యవసర ప్రజా సమస్యపై ఓ మహిళా ఎమ్మెల్యే దీక్ష కొనసాగిస్తుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక్కటి కూడ ఆ దరిదాపులకు రాలేదు. వచ్చినా  అంతగా ప్రాధాన్యత నివ్వలేదు. ప్రభుత్వం నుండి అధికారులు కాని ప్రబుత్వం తరపున ప్రతినిధులు కాని ఎవరూ కనీసం సీతక్కతో  సంప్రదింపులకు రాలేదు. పోలీసులు మాత్రం భారి సంఖ్యలో అక్కడ తిష్ట వేసి పరీశీలిస్తున్నారు. మొదటి రోజే పోలీసులు  సీతక్క దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు. పోలీసులు ఏ క్షణం లోనైనా సీతక్క దీక్ష భగ్నం చేసేందుకు సిద్ద మై పై నుండి వచ్చే ఆదేశాలు కోసం ఎదురు చూస్తున్నారు.

సాయంత్రం పోలీసులు బలవంతంగా సీతక్క దీక్షను  భగ్నం చేశారు.  ఆమెను అంబులెన్సులో ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స చేసారు. అయితే సీతక్క వైద్య చికిత్సకు నిరాకరించడంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఫోన్ లో ఎమ్మెల్యే సీతక్కతో మట్లాడి విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతానని హామి ఇవ్వడంతో  ఆమె దీక్ష విరమించారు.

సీతక్క చేసిన దీక్ష నూటికి నూరు శాతం ప్రజాస్వామ్యసూత్రాలకు లోబడి చేస్తున్నది. ఇది కపట దీక్ష కానే కాదు. రాజకీయ దీక్ష అంతకూ కాదు. నిరుపేదల పక్షాన నిలిచి సీతక్క ఆమరణ దీక్షకు ప్రజాస్వామ్య వాదులంతా మద్దతుగా నిలవాలి. ఆమె దీక్షను పోలీసులు భగ్నంచేసినా గ్రామాల్లో  కొనసాగించాలి. 

కరోనా వైద్య చికిత్సను ఆరోగ్య పరిధిలోకి తెచ్చే వరకు ప్రజాందోళనలు కొనసాగించాలి. 

రాష్ట్రంలో కరోనా కేసులు గ్రామాలకు పాకి నిరుపేదలు కూడ అల్లాడి పోతున్నా ప్రభుత్వం పట్టించు కోవడం లేదని సీతక్క ఆవేదన వ్యక్తం చేసారు.  ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స భారంగా మారిందని నిరుపేదలు వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదన్నారు.  గ్రామాలలో కరోనా సోకి ఆసుపత్రులకు వెళ్ల లేక ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఆరోగ్య శ్రీలో చేరిస్తే నిరుపేదల ప్రాణాలు కాపాడిన వారు అవుతారని అన్నారు. దీక్ష భగ్నం చేస్తే ఆసుత్రిలో నైనా జైలులో నైనా దీక్ష కొనసాగిస్తానని సీతక్క స్పష్టం చేసారు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు