కరోనా కల్లోలంలో మసక బారిన మోడి ఇమేజ్

 విదేశి మీడియా విమర్శలు ఖండించిన ఇండియా


దేశంలో సెకండ్ వేవ్ కరోనా కల్లోలం అంతా ఇంతా కాదు. గత ఏడాది కరోనా విషయంలో లాక్ డౌన్ సకాలంలో  ప్రకటించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంతో కరోనా తీవ్రత బాగా తగ్గింది. దాంతో ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియాలో  కరోనా నియంత్రణ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రపంచ దేశాలు ప్రశంసించాయి. 

కాని రెండో వేవ్ కరోనా ఎఫెక్ట్ ఎవరూ ఊహించ లేదు.  మే నెల మొదటి వారం నుండి ఆందోళన కరమైన రీతిలో కేసులు నమోదు అయ్యాయి. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు బాగా పెరిగి పోయాయి. కేంద్రం కాని రాష్ట్రాలు కాని కరోనా నియంత్రణకు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోక పోవడం వల్ల జరగాల్సిన ప్రాణ నష్టం బాగా జరిగింది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే స్మశాన వాటికల్లో అంత్యక్రియలకు రోజుల తరబడి ఎదురు చూసే దురవస్థ ఎదురు కావడం.

ఇండియాలో కరోనా వ్యాప్తికి అనేక  కారణాలు ఉన్నాయి. అయితే ఓ వైపు కరోనా ఉధృతి కొనసాగుతుటే మరో వైపు దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించడం విమర్శలకు దారి తీసింది. 

కరోనా ఉృతి గమనించి ఎన్నికలు వాయిదా వేస్తే కరోనా ఉధృతి కొంత తగ్గి ఉండేదనే అభిప్రాయాలు నిపుణులు వ్యక్తం చేశారు. అయితే రాజకీయ పార్టీలు ఇవేవి పట్టించు కోలేదు.  ఎన్ని కల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ప్రచార పర్వంలో మునిగాయి. లక్షలాది మందితో బహిరంగ సభలు జరిగాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోది ,హోం మంత్రి సహా అనే క మంది కేంద్ర మంత్రులు ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. ఇవే కొంప ముంచాయని స్వదేశి విదేసి మీడియాలో  విమర్శలు వచ్చాయి. సుప్రీం కోర్టు సహా పలు రాష్ట్రాల హై కోర్టులు కరోనా కేసులపై వచ్చిన వాజ్యాలను విచారించాయి. ప్రభుత్వ తీరును తప్పుపట్టాయి.    ఈ మద్యలోనే కుంభమేళా జరిగింది.  ఆక్సిజన్ అందక దేశ రాజధాని డిల్లీలో కరోనా రోగులు మరణించడం కల కలం రేపింది. ఈ వార్త ప్రపంచ దేశాలలో ఇండియాలో కరోనా కల్లోలం ఎంతగా భయాందోళనకరంగా మారిందో మీడియా విశ్లేషించింది. యుఎస్,ఆస్ట్రేలియా తో పాటు పలు దేశాలు మీడియా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై విమర్శలు ఎక్కు పెట్టడం ఇండియాకు ఇబ్బందిగా మారింది. 

దేశంలో కరోనా సెకండ వేవ్ పరిస్థితులను అదుపు చేయడంలో ప్రధాని మోడీ ఫెయిలయ్యారని విదేశీ మీడియా అనడంపై భారత్ సీరియస్ అయ్యింది. మోడీని విమర్శిస్తూ కథనాలు రాసిన ఆస్ట్రేలియా వార్తా పత్రికది ఆస్ట్రేలియన్ ఎడిటర్ చీఫ్ క్రిస్టోఫర్ డోకు భారత హై కమిషనర్‌ ఈ మేరకు లేఖ రాసారు. మోదీపై వచ్చిన కథనంపుర్తిగా నిరాధారమని ఖండించారు.

వాస్తవంగా కోర్టులు జోక్యం చేసుకున్న తర్వాతే ప్రదాన మంత్రి తన ఎన్నికల ప్రచార యాత్రలు అర్దాంతరంగా ముగించారు.  ఆక్సిజన్ తక్షణ అవసరాలను గుర్తించి ఏర్పాట్లు చేశారు. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోది ముందగా నే కరోనా సెకండ్ వేవ్ పరిస్థితి పసి గట్టి ఉండి ఉంటే గత ఏడాది నియంత్రణ చేసినట్లే  ఈ సారి కూడ చేస్తే విదేశి స్వదేశి మీడియాలో ప్రశంసలు లభించేవి. కాని ఈ సారి కోర్టుల నుండి ఆయన ప్రభుత్వానికి మీడియా నుండి ఆయనకు విమర్శలు ఎదుర్కోక తప్ప లేదు. ఎన్నికల కమీషన్ పై అయితే మద్రాస్ హైకోర్టు తీవ్రంగా మండిపడింది.  

ఎన్నికల కమీషన్ ఎన్నికలు వాయిదా వేసినా లేక ప్రధానమంత్రి నరేంద్ర మోది ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనకుండా దూరంగా ఉండి సకాలంలో సమీక్షలు జరిపి పరిస్థితులకు తగిన విదంగా స్పందించి ఉంటే  పరిస్థితులు మరోలా ఉండేవి.  

మోదీ విమర్శలు ఎదుర్కోవడం కొత్తేమి కాదు కాని కరోనా మహమ్మారి  విషయంలో  వైఫల్యాలు కొట్టొచ్చినట్లు  కనిపించడం ఆయన అభిమానులకు భక్తులకు మింగుడు పడడం లేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు