ఇండియాకు ఐ.టి అగ్రేసరుల బాసట

 ఆదుకుంటామని హామి ఇచ్చిన  ఐ.టి ధిగ్గజాలు


ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభన చూసి ప్రపంచ దేశాలు చలించి పోయాయి. అగ్ర రాజ్యం అమెరికా సహా పలు దేశాలు సహాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. పాకిస్తాన్ సైతం సాయం చేస్తానంటూ స్నేహ హస్తం చాచింది. ఆక్సిజన్ కొరత కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మరణాలు  ప్రపంచ దేశాలలో చర్చనీయాంశం అయ్యాయి. 

ఇండియాలో నెలకొన్న పరిస్థితులు చూసి ఐ.టి ధిగ్గజ అగ్రేసరులు సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల చలించి పోయారు. ఇండియాలో కరోనా మహమ్మారి సృష్టించిన పరిస్థితులు చూసి తన హృదయాన్ని కలిచి వేశాయని సత్య నాదెళ్ల ఆవేదన చెందారు. ఆక్సిజన్ పరికరాల కోసం అట్లాగే వైద్యం కోసం సహాయం చేస్తామని ఆయన హామి ఇచ్చారు. “భారతదేశంలో ప్రస్తుత పరిస్థితుల వల్ల నా గుండె పగిలిపోయింది. సహాయానికి యుఎస్ ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు నేను కృతజ్ఞుడను. సహాయక చర్యలకు సహాయపడటానికి మైక్రోసాఫ్ట్ తన వాయిస్, వనరులు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం కొనసాగిస్తుంది అదేవిధంగా క్లిష్టమైన ఆక్సిజన్ సాంద్రత పరికరాల కొనుగోలుకు మద్దతు ఇస్తుంది, ” అంటూ ఆయన ట్వీట్ చేశారు.

అట్లాగే గూగుల్ సిఇవో కూడ ఇండియాకు సహాయం చేసేందుకు హామి ఇచ్చారు.   వైద్య సామగ్రి, అధికంగా రిస్క్ ఉన్న కమ్యూనిటీలకు అవసరమైన సహాయం అంద చేయంతో పాటు సమాచారం వ్యాప్తికి అన్ని విధాలా తోడ్పాటు నందిస్తామని  సుందర్ పిచాయ్ ట్వీట్ చేసారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు