ఇంటర్నెట్ కోసం సెల్ టవర్ ఏర్పాటు చేయించిన సోను సూద్

 


సామాజిక సేవా రంగంలో ముందుండి సహాయం చేయడమే కాక అడిగిన వారికి తన శక్తి కొద్ది లేదనకుండా తోడ్పడే బాలివుడ్ నటుడు సోను సూద్ ఓ మారు మూల గ్రామంలో ఇంటర్నెట్ సౌకర్యం కోసం సెల్ టవర్ ను నిర్మించాడు. 

మహారాష్ట్రలోని గోడియా జిల్లాకు లో ఓ గ్రామంలో ఇద్దరు సోదరులు అన్మోల్ బిరన్వార్, మున్నా బిరన్వార్  1 నుండి 8 తరగతుల వరకు గ్రామంలో విద్య నభ్యసిస్తున్న 50 మంది విద్యార్థులకు పాఠాలు భోదిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో నేరుగా విద్యార్థులకు పాఠాలు భోదించే అవకాశాలులేక ఆన్ లైన్ తరగతుల కోసం ప్రయత్నాలు చేశారు. అయితే గ్రామంలో సెల్ టవర్ లేక పోవడంతో ఇంటర్నెట్ సదుపాయం లేక ఆన్ లైన్ పాఠాలు నేర్చుకునేందుకు విద్యార్థులకు అవకాసం లేకుండా పోయింది. దాంతో అన్మోల్ బిరన్వార్ ఈ విషయాన్ని నటుడు సోను సూద్ దృష్టికి తీసుకు వెళుతూ సహాయం చేయాలని ట్విట్టర్ ద్వారా కోరాడు. వెంటనే స్పందించిన సోను సూద్ తన స్నేహితుడు  కరణ్ గిల్హోత్రా సహాయంతో గ్రామంలో సెల్ టవర్ నిర్మాణానికి పూనుకున్నాడు. ప్రస్తుతం సెల్ టవర్ నిర్మాణం పూర్తి అయి గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం కలిగింది. దాంతో విద్యా ర్థులతు ఆన్ లైన్ లో పాఠాలు నేర్చుకునే అవకాశం లభించడంతో సోను సూద్ కు కృతజ్ఞతలు తెలిపారు. వీడియో కాల్‌ ద్వారా ఆ గ్రామస్థులతో సోనూ మాట్లాడారు.

గత ఏడాది హర్యానా రాష్ట్రంలో  ఓ గ్రామంలోసోను సూద్ అక్కడి విద్యార్థుల కోరిక మేరక మేరకు ఏయిర్ టెల్ సెల్ టవర్ ఏర్పాటు చేయించారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు