బెంగాల్ నాలుగో విడత ఎన్నికల్లో హింస - సీఐఎస్ఎఫ్ కాల్పులలో నలుగురు మృతి

 పోలింగ్ బూతు క్యూలో నిలబడ్డ యువకున్ని కాలి చంపిన గుర్తు తెలియని వ్యక్తి

బిజెపి, త్రుణమూల్ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలు
నాటు బాంబులతో పరస్పరం దాడులు
చనిపోయింది తృణమూల్ కార్యకర్తలన్న మమత
హాం మంత్రి అమిత్ షా కుట్ర పన్నాడని కాల్పులకు బాద్యత వహించి రాజీనామా చేయాలన్న మమత


 పశ్చిమ బెంగాల్ లో నాలుగో విడత ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది.  కూచ్ బెహర్ జిల్లాలోని సీతల్‌కుచ్చి నియోజకవర్గంలో పోలిం్గ బూతు వద్ద ఓటు వేసేందుకు క్యూలో నిలబడ్డ ఆనంద బర్మన్‌(18) అనేయువకున్ని గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు.  ఆ హత్యోదంతం అనంతరం హింస చెలరేగింది. భారతీయ జనతా పార్టి త్రునమూల్ కాంగ్రేస్ పార్టీల మద్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడులు జరుపుకుని నాటు బాంబులు విసురు కున్నారు. 

పరిస్థితులు అదుపు లోకి తెచ్చేందుకు  సీఐఎస్ఎఫ్  బలగాలు జరిపివన కాల్పుల్లో నలుగురు చనిపోయారు.  కాల్పుల ఘటన అనంతరం  ప్రాన మంత్రి నరేంద్ర మోది పశ్చిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపమలు చేసుకున్నారు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బిజెపి ఓడి పోయిందని తెల్సు ...కేంద్ర హోం మంత్రి అమిత్ షా నా పైన కుట్ర పన్నాడు...సితాల్‌కుర్చి లో నలుగురినికాల్చి చంపారు..ఉదయం మరో యువకున్ని హత్య చేశారని కాల్పులలో చనిపోయిన నలుగురు వ్యక్తులు త్రుణమూల్ కాంగ్రేస్ పార్టి కార్యకర్తలని మమతా బెనర్జి పేర్కొన్నారు. కాల్పులకు భాద్యత వహిస్తు హోంమంత్రి అమిత్ షా పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు.

అయితే మమతా బెనర్జి గూండాయిజం వల్లే హింస చెల రేగిందని బిజెపి ఎదురు దాడికి దిగింది. సిలిగురిలో శనివారం జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ, కూచ్ బిహార్‌లో చాలా విషాదకరమైన సంఘటన జరిగిందన్నారు. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. బీజేపీకి ప్రజలు మద్దతిస్తుండటాన్ని మమత బెనర్జీ, ఆమె గూండాలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. తన కుర్చీ చేజారుతోందని ఆమెకు తెలుసునని, అందుకే ఇంత నీచ స్థాయికి దిగజారిపోయారని దుయ్యబట్టారు. 

‘దీదీ, ఈ హింసాకాండ, భద్రతా దళాలపై దాడికి ప్రజలను రెచ్చగొట్టే చిట్కాలు, పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించే చిట్కాలు మిమ్మల్ని కాపాడవు. పదేళ్ళ మీ తప్పుడు పాలన నుంచి ఈ హింసాకాండ మిమ్మల్ని రక్షించదు’ అని మోదీ అన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు