హైదరాబాద్ లో కరుడుగట్టిన నేరస్తుడు గాలిస్తున్న పోలీసులు


ది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జీవిత ఖైదు అనుభవిస్తు ఆసుపత్రి నుండి తప్పించుకున్న గ్యాంగ్‌స్టర్‌ షేర్‌ హైదర్‌ ఒడిశా నుండి తప్పించుకుని వచ్చి హైదరాబాద్ లో తల దాచుకున్నాడని పోలీసులు గత రెండు రోజులుగా తీవ్రంగా గాలిస్తున్నారు.  ఏప్రిల్ 11 వ తేది సాయంత్రం హైదర్  ఒడిశా లోని కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్‌ కాలేజీ ఆసుప్రతి నుండి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నాడు. 

తనకు ఆరోగ్యం బాగా లేదని కిడ్నీలో నొప్పి వస్తోందని చెప్పగా జైళు వైద్యులు పరీక్సించి ఇతర పరీక్షల కోసం అసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలోనే హైదర్ తప్పించుకునేందుకు పక్కా ప్లాన్ వేశాడు. మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇందుకు హైదర్ కు సహకరించారు. బాత్ రూముకు వెళ్లేందుకు చేతికి ఉన్న సంకెళ్లు తొలగించడంతో హైదర్ పోలీసుల కళ్లు కప్పి తప్పించుకున్నాడు. చాలా ఆలస్యంగా పోలీసులు హైదర్ తప్పించుకున్నట్లు గుర్తించాడు.

అప్పటికే హైదర్ ఓ స్విఫ్టు కారులో రాష్ట్రం పొలిమేరలు దాటి ఆంధ్ర రాష్ట్రం వైజాగ్ వైపు ప్రయాణం అయ్యాడు. వైజాగ్ నుండి విజయవాజ మీదుగా హైదరాబాద్ చేరినట్లు పంతంగి టోల్ ప్లాజా వద్ద గుర్తించారు. ఓడిశా నుండి వచ్చిన పోలీసు ప్రత్యేక బృందం హైదరాబాద్ టాస్క్ ఫోర్సు పోలీసులు సహాయంతో నగరంలో గాలింపు చేపట్టింది. అయితే 48 గంటలు గడిచినా ఇంత వరకు హైదర్ ఆచూకి లభించ లేదు. 

హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సేకరించిన ఆధారాలను బట్టి సదరు గ్యాంగ్‌స్టర్‌ హైదర్‌ ప్రయాణిస్తున్న స్విఫ్ట్‌ వాహనం ఓడీ 02 ఏఎస్‌ 6770  ఏప్రిల్ రాత్రి 8.42 గంటలకు పంతంగి టోల్‌ ప్లాజా దాటింది. తర్వాతనగరంలో కారు తిరిగినట్లు అక్కడక్కడా పోలీసులకు ఆధారాలులభించాయి. కాని హైదర్ తల దాచుకున్న  అడ్డా సమాచారం కనుగోలేక పోయారు.  అయితే హైదర్ అప్పటికే  హైదరాబాద్ నగరం దాటి మహారాష్ట్ర వైపు పారి పోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. హైదర్ కు మహారాష్ట్రలో  పాత ,,ెల్టర్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అక్కడికి ప్రత్యేక బృందాలను పంపి గాలింపు చేపట్టనున్నారు. 

హైదరాబాద్ నగరంలో హైదర్ కోసం గాలింపు కొనసాగుతోందని  నగర కమీషనర్ అంజని కుమార్ తెలిపారు. ఎవరికైనా ఆచూకి లభిస్తే 94906 16640 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. 

షేర్ హైదర్ అనేక నేరాల్లో నిందితుడు. ఇతనిపై పలు కిడ్నాప్ కేసులు హత్యల కేసులు ఉన్నాయి.  ఒడిశాకు చెందిన ఓ మైన్స్  యజమానికి కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో  హైదర్‌కు భువనేశ్వర్‌ కోర్టు 2015లో జీవిత ఖైదు విధించింది. అంతకు ముందు 2011లో మరో గ్యాంగ్‌స్టర్‌ షేక్‌ సులేమాన్‌ సోదరుడు షేక్‌ చాను హత్య కేసులోనూ ఇతడికి జీవితఖైదు పడింది. 2017 వరకు భువనేశ్వర్‌లోని ఝార్పాడ జైలులో ఉన్న హైదర్‌ భద్రత కారణాల నేపథ్యంలో సబల్‌పూర్‌ జైలుకు మార్చారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు