పాపి కొండల సందర్శనకు ఏప్రిల్ 15 నుంచి అనుమతి

 టూరిస్టులతో సందడి కానున్న పాపి కొండలు


ఆంధ్ర ప్రదేశ్ లో పాపుల్ పర్యాటక ప్రదేశం పాపి కొండలు. ఏడాదిన్నర క్రితం దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద లాంచి మునిగిన ప్రమాదంలో 50 మంది జల సమాధి అయ్యారు. అప్పటి నుండి పాపికొండల సందర్శన నిలిపి వేశారు. గోదావరి నదిలో భద్రాచలం నుండి లేదా రాజమండ్రి నుంచి పాపి కొండలకు సందర్శలు వెళ్లేవారు. దేశంలో వివిద రాష్ట్రాల నుండి  వచ్చే సందర్శకులతో సందడిగా ఉండేది. అనేక మంది ఈ పర్యాటక ప్రదేశంలో ఉపాధి పొందే వారు. ఏడాదిన్నర నుంచి సందర్శకులను అనుమతించక పోవడంతో లాంచీలు నడిపేవారు ఇతరత్రా పర్యాటకులను ఆకట్టుకునే చిరు వస్తువులు విక్రయించే వారికి ఉపాధి లేకుండా పోయింది.  ప్రధానంగా ఏజెన్సీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కు చెందిన కోయరెడ్లు ఈ పర్యాటక రంగం ద్వారా ఉపాధి పొందుతున్నారు. బొంగు చికెన్ వంటకం ఇక్కడ చాలా ఫేమస్. చేపల ఫ్రై, మటన్, చికెన్ తో చేసే రక రకాల వంటకాలు కూడ ఫేమస్. హరిత హోటెల్ పర్యాటకులతో సందడిగా ఉండేది. పాపి కొండల వద్ద ఇసుక తిన్నెలపై వేసిన టెంట్లలో పర్యాటకులు బసచేసే వారు. ప్రకృతి ఒడి అంటే పాపికొండలని చెబుతుంటారు.

గోదావరి నదిలో సుమారు 60 కిలోమీటర్ల మేర  50 వరకు లాంచీలు నడిచేవి. ఇందులో ఎసి లాంచీలు కూడ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ప్రైవేట్ లాంచీలకు అనుమతులు ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ కు చెందిన హరిత లాంచీకి మాత్రమే కాకినాడ పోర్టు అధికారులు   అనుమతులు ఇచ్చారు. తదుపరి ఫిట్ నెస్ కలిగిన ప్రైవేట్ లాంచీలకు అనుమతులు ఇచ్చేందుకు సమయం పడుతుందని టూరిజం శాఖ అధికారులు చెబుతున్నారు. కాకినాడ పోర్టు అధికారులు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే తప్ప ప్రైవేట్ లాంచీలకు అనుమతులు ఇవ్వరు. ఎక్కువ శాతం ప్రైవేట్ లాంచీల ద్వారా ఉపాధి పొందుతున్నారు.  ఇంత కాలం పర్యాటకులు లేక చిన్న బోయినట్లు కనిపించిన పాపి కొండలు తిరిగి పర్యాటకులతో కల కల లాడనుంది. లాంచీ ప్రయాణాల్లో గతంలో దొర్లిన నిర్ణక్ష్యాలను పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు