లాక్ డౌన్ లేదు - స్వీయ నియంత్రణే మందు

 


కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విషయంలో  చేతులెత్తేసింది. ఎవరి చేతులు వారి నెత్తి మీదే పెట్టింది.  కరోనా నుండి కాపాడు కోవాలంటే అది మీ చేతల్లోనే ఉందని తేల్చి చెప్పింది. ఇప్పుడు కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్లు ప్రకటించి వాణిజ్య, వ్యాపార సముదాయాలు మూసివేయించి సడక్ లపై బారికేడ్లు పెట్టి టోటల్ గా లాఠీలు పట్టుకున్న పోలీసులతో కాపలా పెట్టించే పరిస్థితి ఉత్పన్నం కాబోదు. ఇవన్ని గత ఏడాది కరోనా మహమ్మారి కారణంగా మనం దేశ వ్యాప్తంగా చూసినవే. కనీసం ఆరు నెలల పాటు ప్రభుత్వ నియంత్రణలో కొత్త జీవితానికి అలవాటు పడ్డాం. ప్రైవేట్ కార్పోరేట్ ఉద్యోగులు అయితే  ఇంటి పట్టునే ఉండి పోయి వర్క్ ఫ్రం హోం వంటి పనులకు అలవాటు పడి పోయారు. క్రమంగా లాక్ డౌన్ సడలింపులు  వచ్చినా ఇప్పటికి వర్క్ ఫ్రం హోం కొనసాగుతోంది. 

కరోనా కల్లోలంలో ఎక్కువ శాంత నష్ట పోయింది చిరు వ్యాపారులు. రోజు కష్టం చేసుకుంటే కాని పొట్ట పోసుకోలేని  కార్మిక, కర్షక కష్ట జీవులు. 

ఏదో విపత్తు, ఉప్పెన మానవ జాతిని ముంచేస్తుందనే రీతిలో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో పనులు బంద్ అయి తిండికి గడవక మైళ్ళ తరబడి ఈ దేశ కష్ట జీవులు జాతీయ రహదారుల వెంట, రైల్వే ట్రాక్ ల వెంట బారులు తీరిన దృష్యాలు అనేకం మనం మరిచి పోలేని భాదాకర సాదృష్యాలు.

తిరిగి ఇలాంటి పరిస్థితులు దాపురించే పరిస్థితులు లేవు. కరోనా కట్టడి కోసం కేంద్రం విధించిన ఆంక్షలు చాలా వరకు కరోనాను కట్టిడి చేశాయనేది ఎంత వాస్తవమో ఆర్థిక పరిస్థితులు అంతకంతకూ దిగ జారాయనేది కూడ అంతే వాస్తవం. ఆర్థిక పరిస్థితి దిగ జారి పోయే ప్రమాదం కారణంగా  మరో సారి  లాక్ డౌన్ విధించి లేమని స్థానిక నియంత్రణకు వదిలి వేసామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేసారు. 

ఎక్కడ కరోనా కేసుుల ఎక్కువగా ఉంటాయో అక్కడ మాత్రమే కేసుల తీవ్రతను బట్టి కట్టడి నిర్ణయాలు ఉంటాయి. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్‌పాస్‌తో జరిగిన వర్చువల్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనేక విషయాలు ప్రస్తావించారు. కరోనా కట్టడి చర్యలు వివరిస్తూ ఫైవ్ పిల్లర్స్ వ్యూహం ప్రకటించారు. టెస్ట్ , ట్రాక్ , ట్రీట్ , వ్యాక్సిన్ , రూల్స్ వంటి ఐదు స్తంభాల  విధానాలతో కరోనాను నియంత్రించే చర్యలు చేపట్టామని తెలిపారు. 

ఏప్రిల్ రెండో వారంలో కరోనా కేసులు గరిష్ట  స్థాయికి చేరడం ఆందోళన కలిగస్తోంది అయితే మే నెల చివరి నాటికి కరోనా నియంత్రణ లోకి వస్తుందని శాస్ర్త వేత్తలు భావిస్తున్నారు. దేశంలో  ఏప్రిల్ 14 నాటికి సగటు కరోనా కేసులు 1.84 లక్షలకు చేరినట్లు గణాంకాలు వివరిస్తున్నాయి.

కనుక ఇక కరోనా నియంత్రణ అనేది మన చేతుల్లోనే ఉందని గ్రహించి అందరూ బుద్దిగా వ్యవహరించాలి.  మూతికి మాస్కులు చేతులకు సానిటైజర్లు పూసుకోవడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు చాలా వరకు కరోనాను మన దరికి చేరకుండా కాపాడుతాయి. నిర్లక్ష్యం వహించిన చోటే కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని గ్రహించాలి.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు