రాకేశ్వర్‌ సింగ్ ను క్షేమంగా విడుదల చేసిన మావోయిస్టులు

 
బీజాపూర్‌ జిల్లా తర్రెం ఎన్‌కౌంటర్‌ సందర్భంగా మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్‌పీఎఫ్‌ కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ మన్హాస్  ను విడుదల చేసారు.  రాకేశ్వర్ సింగ్ మావోయిస్టుల చేతిలో బందీ అయి గురువారం నాటికి ఐదు రోజులు అయింది. ఏప్రిల్ 3 వ తేదీన జరిగిన భీకర యుద్ధంలో  24 మంది జవాన్లు చనిపోగా రాకేశ్వర్ సింగ్ ను ప్రాణాలతో బందీగా పట్టుకున్నారు. ముందు అతని జాడ తెలియక పోవడంతో కుటుంబ సబ్యులు ఆందోళన చెందారు. అతన్ని విడిచి పెట్టాలని అతని భార్య మీను ఐదేళ్ల కూతురు మావోయిస్టులను వేడుకున్నారు. 

రాకేశ్వర్ సింగ్ క్షేమంగా ఉన్నాడని మావోయిస్టులు అతని ఫోటోను విడుదల చేసారు. రాకేశ్వర్ సింగ్ ను క్షేమంగా విడుదల చేస్తామని అయితే  మద్యవర్తుల పేర్లు ప్రకటించాలని శరతు విధించారు. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు. మద్యవర్తిత్వం కోసం జైలు బందీ విడుదల కమిటీ'లోని ఐదుగు సభ్యులు సామాజిక కార్యకర్త సోని సోరి సహా స్థానిక జర్నలిస్టులు కొందరు వెళ్లి నట్లు వార్తలు వెలువడ్డాయి కాని ఎవరు అధికారికంగా నిర్దారించలేదు. 

గురువారం మద్యాహ్నం రాకేశ్వర్ సింగ్ ను విడుదల చేస్తున్నట్లు మావోయిస్టులు సమాచారం చేర వేసారని తెల్సింది. 

కోబ్రా కమాండోను విడిపించింది వీరే

పద్మశ్రీ అవార్డుగ్రహీత ధర్మపాల్ సాయిని, గిరిజన నాయకుడు తేలం బొర్రయ్య తో పాటు స్థానిక జర్నలిస్టులు మిశ్రా, ముఖేష్ చంద్రాకర్ సిఆర్ పిఎఫ్ కో బ్రా కమాండర్ రాకేశ్వర్ విడుదలకు మద్యవర్తిత్వం నిర్వహించారు.

దట్టమైన అడవిలో 20 గ్రామాల గిరిజనుల సమక్షంలో జరిగిన జన్ అదాలత్ లో రాకేశ్వర్ సింగ్ ను భంద విముక్తున్ని చేసి మద్యవర్తులకు అప్పగించారు. రాకేశ్వర్ సింగ్ ను టూ వీలర్ మోటార్ సైకిల్ పై బీజాపూర్‌  సిఆర్ పిఎఫ్ కాంపుకు తీసుకు వచ్చారు. అతన్ని మెడికల్ చెకప్ కు పంపించారు.

రాకేశ్వర్ సింగ్ అధికారుల అనుమతి తీసుకుని తన భార్య మీను తో తల్లి కుంతి దేవితో ఫోన్ లో మాట్లాడారు. 

అంతకు ముందు ప్రముఖ సోషల్ అక్టివిస్ట్ సోని సోరి మావోయిస్టులతో మద్యవర్తిత్వం నెరవగా మావోయిస్టులు రాకేశ్వర్ సింగ్ ను విడుదల చేసేందుకు అంగీకరించనట్లు వార్తలు వచ్చాయి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు