కోచ్ ఫ్యాక్టరీ సాధనకు ఉద్యమం ఉధృతం

 రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాల నిర్ణయం
కోచ్ ఫ్యాక్టరీ సాధన ఉద్యమాన్ని ఉదృతం చేయాలని తీర్మాణం
రాజకీయ పార్టీల చిద్దశుద్ధిని ప్రశ్నించిన ప్రజాసంఘాలు
టిఆర్ఎస్ పార్టి అసెంబ్లీలో తీర్మానం చేయాలని  డిమాండ్


పాలక వర్గ పార్టీలు వారి వారి స్వలాబానికి కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని వాడుకుంటున్నారని కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపి పార్టీలతో సహా మిగతా పార్టీలు కోచ్ ఫ్యాక్టరీ విషయంలో వారి చిత్తశుద్ధిని చాటుకోవాలని   కోచ్ ఫ్యాక్టరి సాధన ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు  సవాల్  చేసింది.

తెలంగాణ విభజన చట్టంలో పొందుపరిచిన కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని టిఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రశ్నించడం లేదని టిఆర్ఎస్ వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని ప్రజా సంఘాల నేతలు  డిమాండ్ చేశారు.

 గత నాలుగు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం ప్రగతిశీల శక్తులు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఐక్యత తో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ప్రజా సంఘాలు నాయకులు  ప్రకటించారు. 

 గురువారం వరంగల్ నగరం  ఎం.సి.పి.ఐ జిల్లా కార్యాలయంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు చింతకింది కుమారస్వామి అధ్యక్షతన  కోచ్ ఫ్యాక్టరీ సాధన- ప్రజా సంఘాల పాత్ర పై జరిగిన  రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ సంఘాలు, పార్టీలు పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

   కాంగ్రెస్ పార్టి సైతం అసెంబ్లీలో ఈ అంశంపై చర్చించాలని తెలంగాణ నిరుద్యోగులకు టిఆర్ఎస్ అన్యాయం చేస్తుందని పదే పదే మాట్లాడే బిజెపి నాయకులు కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఎందుకు వారి అధిష్టానాన్ని నిలదీయడం లేదని  ప్రశ్నించారు. తెలంగాణ కోసం అన్ని పార్టీలు ఏకమైనట్లు కోచ్ ఫ్యాక్టరీ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమవ్వాలని, కోచ్ ఫ్యాక్టరీ సాధన ఉద్యమంలో కలిసిరాని పార్టీలను ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. 

   కోచ్ ఫ్యాక్టరీ సాధన ఉద్యమాన్ని వరంగల్ మహానగరంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి మండలానికి తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేసి మరో తెలంగాణ లాంటి ఉద్యమం చేయాలని తీర్మానించారు.

   ఈ కార్యక్రమంలో ఎం.సి.పి.ఐ జిలా అధ్యక్షుడు పనాస ప్రసాద్, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ వరంగల్ పార్లమెంటు కన్వీనర్ సాయిని నరేందర్, న్యూ డెమోక్రసి పార్టీ నాయకులు నున్న అప్పారావు, సి.పి.ఎం. నాయకురాలు నలిగంటి రత్నమాల, సి.పి.ఐ జిల్లా నాయకులు గన్నారపు రమేష్, కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి కోఆర్డినేటర్ బండి దుర్గాప్రసాద్, పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ నాయకులు సోమ రామమూర్తి, ఎ ఐ ఎఫ్ డి ఎస్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున, రైతు స్వరాజ్య వేదిక నాయకులు బీరం రాము, వివిధ ప్రజాసంఘాల నాయకులు పొగుల ప్రసాద్, కళ్లెపెళ్లి ఇందిర, గజ్జెల లింగమూర్తి, మార్తాల చందర్ రావు, నలిగింటి చందర్ రావు, దుర్గయ్య, సాంబన్న, సునిల్, మక్బూల్ పాషా, నల్లెల రాజన్న, కొమ్ముల సురేందర్, కేడల ప్రసాద్, పోరిక ఉదయ్ సింగ్ నాయక్, బొడ్డు కుమారస్వామి, కొంతం కృష్ణ, అప్పనపూరి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు