అణచివేత కోసమే ఎన్ఐఏ దాడులు - మానవ హక్కుల వేదిక



తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిన్న  అంటే 31 మార్చి 2021 న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు హక్కుల సంఘాల కార్యకర్తలపై ఇతర సంఘాల కార్యకర్తలపై దాడులు చేసి, సోదాల పేరుతో భయోత్పాతాన్ని  కల్గించడాన్ని మానవ హక్కుల వేదిక ఖండించింది.

  మానవ హక్కుల వేదిక తెలంగాణ -ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షుడు గొర్రెపాటి మాధవరావు, ప్రధాన కార్యదర్శి

 డా౹౹ ఎస్.తిరుపతయ్య  అరెస్టులను ఖండిస్తు పత్రికా ప్రకటన విడుదల చేసారు.

రెండు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేస్ రాష్ట్రాలలో పలు జిల్లాలలో ఎన్ఐఏ దాడులు నిర్వహించి సెల్ ఫోన్లు, హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్ లతో పాటు విప్ల సాహిత్యం, డాక్యుమెంట్లు స్వాదీనం చేసుకుంది. 

ఏపీలో విశాఖ పట్నం, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం,కర్నూలు, కృష్ణా, తూర్పు గోదావరి, కడపతోపాటు తెలంగా ణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజి గిరి, మెదక్‌ జిల్లాల్లో తనిఖీలు చేసినట్లు పేర్కొంది. వారికి మావోలతో లింకులపై అనుమానాల నేపథ్యంలో ఈ సోదాలు జరిపారు.

పలువురు పౌరహక్కుల నేతలను అరెస్టు చేసి  40 మొబైల్‌ఫోన్లు, 44 సిమ్‌కార్డులు, హార్డ్‌డిస్క్, మైక్రో ఎస్డీ కార్డులు, ఫ్లాష్‌ కార్డులు తదితర 70 స్టోరేజ్‌ డివైజెస్, 184 సీడీలు/డీవీడీలు, 19 పెన్‌డ్రైవ్‌లు, ట్యాబ్, ఆడియో రికార్డర్, ఒక అనుమానితుని నుంచి రూ.10లక్షల నగదు, కొడవళ్లు, గొడ్డళ్లు, కత్తులు మావోయిస్టు పార్టీ సాహిత్యంతో ఉన్న లేఖలు, అనేక అనుమానాస్పద డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ ప్రకటించింది.

సమన్వయ కమిటీ సభ్యుడు విశాఖపట్నం నివాసి అయిన వి. ఎస్. కృష్ణ విశాఖపట్నం ఇంటిపై  సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు మొదలైన సోదా అర్ధరాత్రి దాటిన తర్వాత 2:30 వరకు కొనసాగిందని పౌరహక్కులనేతలు తెలిపారు.  కొన్ని హార్డ్ డిస్క్ లను,  కృష్ణ వాడుకునే టెలిఫోన్ ను,  మార్కెట్లో దొరికే పుస్తకాలను  మా సంస్థ ప్రచురించిన కొన్ని పత్రాలను పోలీసులు  స్వాధీనం చేసుకున్నారని

   మంచింగ్ ఫుట్   పోలీసు స్టేషన్ లో నమోదైన  ఒక కేసులో v.s. క్రిష్ణ ను ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.  వాకపల్లి గిరిజన మహిళలు ధైర్యంగా నిలబడి తమను రేప్ చేసిన వారికి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పడం లో కృష్ణ పాత్ర ఉందని పోలీసులు  ఎప్పటినుంచో కృష్ణ పై గుర్రుగా ఉన్నారన్నారు. 


  మంచింగ్ ఫుట్  పోలీసు స్టేషన్లో అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం, (Unlawful Activities Prevention Act...--UAPA)  లోని వివిధ సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులో  కృష్ణ మావోయిస్టు కార్యకలాపాలకు సహకరిస్తాడు అని అరెస్టు అయిన ఓ వ్యక్తి నుంచి  పోలీసులు ఒక ఒప్పుకోలు ప్రకటనను   రాయించుకుని కృష్ణను కేసులో ముద్దాయిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని హక్కుల నేతలు రోపించారు. మావోయిస్టు కార్యకలాపాలకూ, మానవ హక్కుల వేదిక కార్యక్రమాలకూ ఏ మాత్రమూ సంబంధం లేదని   వి ఎస్ కృష్ణ కూ మావోయిస్టు పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని  కృష్ణకు మావోయిస్టులతో సంబంధాన్ని అంటగట్టడాన్ని మానవ హక్కుల వేదిక తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. 

   ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  పౌరహక్కుల సంఘం అధ్యక్షుడైన వేడంగి చిట్టిబాబు రాజమహేంద్రవరం నివాసంపై నా,   ప్రధాన కార్యదర్శి అయిన చిలుకా చంద్రశేఖర్ సత్తెనపల్లి నివాసం పైన,  పౌరహక్కుల సంఘం తెలంగాణ ఉపాధ్యక్షుడు రఘునాథ్ ఇంటి పైన దాడులు చేసి సోదాలు చేయటాన్ని మానవ హక్కుల వేదిక ఖండించింది.  ఇతర సంఘాల నాయకుల  ఇళ్లపై కూడా దాడులు చేసి సోదాల   పేరుతో భయాందోళనలను కలిగించటం  దుర్మార్గ మని  సోదాల పేరుతో  సాక్ష్యాలను కూడా పోలీసులు సృష్టించే అవకాశం ఉందని  గతంలో ఇలా   సాక్ష్యాలను సృష్టించినట్లు గా  ఇటీవలే బయటపడిందని   మహా క్రూరమైన అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం  ప్రయోగించడమే  క్రూర నియంతృత్వ చర్య అని మానహక్కుల 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు