ఆత్మహత్య యత్నానికి పాల్పడిన నిరుద్యోగి సునీల్ మృతి

సునీల్ విషాదాంతం....


కాకతీయ యూనివర్శిటి కాంపస్ లో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన నిరుద్యోగి బోడ సునీల్ నాయక్ శుక్రవారం తెల్లవారు జామున నిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించాడు. 

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తెజావత్ రాంసింగ్ తండా కు చెందిన సునీల్ నాయక్ మార్చి 26 వ తేదీన కాంపస్ ఆవరణలో  లైవ్ లో సెల్ఫి వీడియో తీసుకుని పురుగుల మందు తాగాడు.  తెలంగాణ రాష్ట్ర వచ్చినంక ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తే  రాలేదని ఏఏఎస్ కావాలని కలలు గని చివరికి ఎస్.ఐ, కానిస్టేబుల్ పోస్టుకు కూడ సెలెక్ట్ కాలేక పోయానని తన చావుకు సిఎం కెసిఆర్ కారణమని ఆయన పై అగ్రహం వెల్లగక్కుతూ సునీల్ పురుగుల మందు తాగాడు. అతన్ని వెంటనే వరంగల్ ఎంజిఎం ఉక తరలించి చికిత్స చేశారు.  సునీల్ ఆరోగ్యం క్షీణించడంతో  రెండు రోజుల అనంతరం హైదరాబాద్ కు తరలించారు. నిమ్స్ లో  తికిత్స పొందుతు మరణించాడు.

కేసీఆర్‌ను అరెస్టు చేయాలి: బండి సంజయ్‌
రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రభుత్వ అసమర్థ పాలనే దీనికి కారణమని ఆరోపించారు. ఉద్యోగం రావడం లేదంటూ ఆత్మహత్య చేసుకున్న సునీల్‌ నాయక్‌ కుటుంబ సభ్యులను బండి సంజయ్‌ పరామర్శించారు. సునీల్‌ ఆత్మహత్యాయత్నం చేసుకునే సమయంలో సీఎం కేసీఆర్‌ పేరు ప్రస్తావించినందుకు.. కేసీఆర్‌ను అరెస్టు చేయాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

సునీల్ ఆత్మహత్య పై పలువురు విచారం వ్యక్తం చేసారు.

సునిల్ కుటుంబాన్ని అన్ని రకాల ఆదుకోవాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ వరంగల్ పార్లమెంట్ కన్వీనర్  సాయిని నరేందర్ డిమాండ్ చేసారు. సునిల్ మరణంతోనైన కెసిఆర్ ప్రభుత్వం కళ్ళు తెరిచి యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని అందుకోసం వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని డిమాండ్ చేశాడు. పోరాట చరిత్ర గల తెలంగాణలో ఆత్మబలిదానాలు సరికాదని తెగించి కొట్లాడి మన హక్కులు, మన ఉద్యోగాలు మనం సాధించాలని ఆ దిశగా జరిగే పోరాటంలో బి.ఎల్.ఎఫ్ ముందుంటుందని యువకులు, విద్యార్థులు ఆత్మహత్యలు ఆపి మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు