కొవ్వొత్తుల ర్యాలీ తో బోడ సునిల్ కు నివాళులు

 కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన కెయు విద్యార్థులు
సునిల్ ఆశయసాధనకు ఉద్యమిస్తామని నినదించిన యువత

 


తెలంగాణ నిరుద్యోగాలకు ఉద్యోగావకాశాలు  కల్పించాలని ఆత్మ బలిదానం చేసుకున్న కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి బోడ సునిల్ కు నివాళులు అర్పిస్తూ  వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ పట్టణంలో యువత, ప్రజా సంఘాలు ర్యాలీ తీసారు. కెయు జాక్ విద్యార్థి నాయకుడు వినోద్ లోక్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన   ర్యాలీ కాళోజీ సెంటర్ నుండి అమరవీరుల స్థూపం వరకు సాగింది. అమరవీరుల స్థూపం వద్ద కొవ్వొత్తులు పెట్టి మాట్లాడారు. 

    వినోద్ లోక్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని, సునీల్ నాయక్ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వయోపరిమితి పెంపుని వెనక్కి తీసుకోవాలని, తెలంగాణ నిరుద్యోగ యువత కోసం సునిల్ అమరుడయ్యాడని ఆయన ఆశయ సాధనకోసం తెగించి కొట్లాడడానికి యువత సిద్ధం కావాలని లోక్ నాయక్ పిలుపునిచ్చారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ వరంగల్ పార్లమెంటు కన్వీనర్ సాయిని నరేందర్ మాట్లాడుతూ ఉద్యమాల ద్వారా సాధించిన రాష్ట్రంలో నిరుద్యోగ ప్రాణ త్యాగాలకు  బాధ్యత వహించి ముఖ్యమంత్రి కేసిఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం  నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని, నిరుద్యోగుల సమస్యను గాలికి వొదలి ఉద్యోగులకు పదవి విరమణ వయసు పెంచడం సరికాదని అన్నారు. సునిల్ కోరుకున్న ఉద్యోగాలు, ఉపాధి సాధించేవరకు యువత పోరాటం ఆపరాదని యువతకు ప్రజా సంఘాలు అండగా ఉంటాయని అన్నారు. 

   లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పోరిక ఈశ్వేర్ సింఘ్ నాయక్, పీఫుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ సోమ రామ్మూర్తి, బి.సి. జాక్ ఛైర్మన్ తిరునహరి శేషు, కె యు జాక్ చైర్మన్ తిరుపతి యాదవ్, మేడ రంజిత్ ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు  వలిఉల్లాఖాద్రీ, ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర నాయకులు సమ్మయా రాథోడ్, కరుణాకర్ నాయక్, నవీన్ నాయక్ టేస్టా బాధ్యులు లునావత్ దేవా సింగ్, యాకూబ్ నాయక్, వీరు నాయక్, దేవేందర్ నాయక్, జిఆర్ఎస్ఎస్ నాయకులు మహేందర్ నాయక్, స్వామి నాయక్, భాస్కర్ నాయక్, రమేష్ నాయక్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు కూచన రవళి, గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి, అశ్విన్ రాథోడ్, ఎబిఎస్ఎఫ్ గౌతం రాజ్, విద్యార్థి నాయకులు సురేందర్, బోట్ల తేజ, సురేశ్ నాయక్, యూత్ కాంగ్రెస్ నాయకులు తోట పవన్, వైఎస్ఆర్సిపి నాయకులు అమర్ చల్ల, రాయిని గూడెం ఉద్యమ కారులు కృష్ణ లత, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు