పక్కా వ్యూహంతో మెరుపు దాడి - 24 కు చేరిన మృతుల సంఖ్య

 మావోయిస్టులు భద్రతా దళాల మద్య భీకర కాల్పులతో రక్త సిక్తమైన దండకారణ్యం

హిద్మా కోసం భద్రతా దళాలను  ట్రాప్ చేసి మెరుపు దాడి 


చత్తీస్ గఢ్ సుక్మా, బీజాపూర్ జిల్లాల స‌రిహ‌ద్దుల్లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలపై మావోయిస్టులు చేసిన మెరుపు దాడిలో మృతుల సంఖ్య 24 కు పెరిగింది.  మరో 43 మంది  జవాన్లు స్వల్పంగా 16 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.  సంఘటన స్థలంలో కాల్పుల్లో చనిపోయిన 17 మంది మృ దేహాలు స్వాదీనం చేసుకున్నారు. మిగతా వారు తీవ్ర గాయాలతో  చికిత్స పొందుతూ మరణించారు. 

మావోయిస్టులు కూడ భారి సంఖ్యలోనే  ఈ ఎదురు కాల్పుల్లో చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 

భద్రతా దళాలు చాలా కాలంగా  హిద్మా  కోసం గాలిస్తున్నాయి. అతని తలపై 25 లక్షల రివార్డు ఉంది. అతని కోసం గాలిస్తున్న  భద్రతాదళాలకు మావోయిస్టులు తప్పుడు సమాచారం చేర వేసి వారిని ట్రాప్ చేశారు. ఆ ప్రాంతంలో హిద్మా సంచరిస్తున్నాడని సమాచారం అందుకున్న  సీఆర్పీఎఫ్‌ దళాలకు చెందిన ప్రత్యేక ఎలైట్ కోబ్రా ట్రూపుతో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్,  జిల్లా రిజర్వు బలగాల జవాన్లు సుమారు 2 వేల మంది తో గాలింపు చేపట్టారు. మావోయిస్టు గెరిల్లా ఆర్మీ గుట్టలపై నుంచి జవాన్లపై మెరుపు దాడికి పాల్పడడంతో భద్రతా దళాలు ఊహించని పరిణామానికి తేరుకునే లోపే భారీగా ప్రాణ నష్టం జరిగింది. గుట్టలపై నుండి మావోయిస్టులు బుల్లెట్ల వర్షం కురిపించారు. సుమారు మూడు గంటలకు పైగా ఇరు వర్గాల మద్య నిర్విరామంగా  భీకర మైన కాల్పులు ఏకధాటిగా కొనసాగాయి. భద్రతా దళాలకు ముందు ప్రాణ నష్టం జరిగినా ఆ తర్వాత తేరుకుని మావోయుస్టుల దాడిని తిప్పి కొట్టారు.  

మావోయిస్టుల్లో 9 మంది మరణించి బస్తర్ ఐజీపి సుందర్ రాజ్ వెల్లడించారు. మరో 15 గాయపడ్డారని ఆయన తెలిపారు. 

డీ హైడ్రేషన్ తో నే మరణాలు 

సుదీర్ఘంగా జరిగిన కాల్పులలో భద్రతా దళాల జవాన్లు డీ హైడ్రేషన్ తో చనిపోయిరని అధికారులు అనుమానిస్తున్నారు. అడవిలో చాలా దూరం కాలినడకన గాలింపు చేపట్టిన భద్రతా దళాలు చాలా వరకు మంచి నీటిని, అహారాన్ని తమ లగేజీలలో తగ్గించు కున్నాయి. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో మంచి నీరు అందక దాహంతో అలమటించారని తెలుస్తోంది.

భద్రతా దళాల మృతిపట్ల రాష్ట్ర పతి కృష్ణ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోది, హోం మంత్రి అమిత్ షా తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు. మావోయిస్టులను ఎదుర్కోవడంలో భద్రతా దళాలు చేసిన త్యాగాలను దేశ ప్రజలు మరువ లేరని అన్నారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు