పరధ్యానంలో డబుల్ డోస్ వాక్సిన్ ఇచ్చిన నర్సు

  ఉత్తర ప్రదేశ్ లో ఓ ప్రైమరి హెల్త్ సెంటర్ లో జరిగిన  సంఘటన


ఉత్తర ప్రదేశ్ లో ఓ నర్సు సెల్ ఫోన్లో ఎవరితోనో  మాటల్లో పడి పరధ్యానంలో  ఓ మహిళకు  కరోనా వాక్సిన్ డబుల్ డోస్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లాలో 50 ఏళ్లు పై బడిన కమలేష్ కుమారి అనే మహిళ అక్బర్ పూర్ లోని ప్రైమరి హెల్త్ సెంటర్ కు ఏప్రిల్ 2 న వెళ్లింది. అర్చన అనే నర్సు ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతు కమలేష్ కుమారికి ఒకే సారి రెండు సార్లు వాక్సిన్ ఇచ్చింది. రెండు సార్లు తనకు వాక్సిన్ ఇచ్చినట్లు గమనించిన ఆ మహిళ నర్సును అడగడంతో పొరపాటు గ్రహించిన నర్సు ఏం కాదులే అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. పొరపాటు తన వైపు నుండి జరగలేదని దబాయించ బోయింది. మహిళ వినక పోవడంతో ఆ మహిళ పైనే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏంకాదులే ఏమన్నా జరిగితే అప్పుడు చూద్దాం అంటూ చెప్పింది.  దాంతో మహిళ భయపడి తన కుటుంబ సబ్యులకు విషయం చెప్పడంతో వారు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.   వారికి తోడుగా అక్కడున్న వారు కూడ మద్దతు పలికారు. దాంతో జిల్లా మెజిస్ట్రేట్ జితేంద్ర ప్రతాప్ సింగ్ ఇతర వైద్యాధికారులు అక్కడికి చేరుకుని విచారణ  జరిపారు.  నర్సు నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించి విచారణకు ఆదేశించారు. అదే విదంగా  ఈ విషయం తెల్సి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కూడ విచారణకు ఆదేశాలు అందాయి. 24 గంటల్లోగా విచారణ రిపోర్టు అందాలని  వైద్యాధి కారులను ఆదేశించారు. రెండు డోసుల వాక్సిన్ తీసుకున్న  కమలేష్ కుమారి చేయి వాపు ఎక్కింది. అయితే ప్రమాదం లేదని వైద్యులు పరీక్షించి చెప్పారు. ఆమెను వైద్య  పర్యవేక్షణలో ఉంచాలని  కుటుంబ సబ్యులు జిల్లా మెజిస్ట్రేట్ ను కోరారు.  డబుల్ డోస్ ఎఫెక్ట్ పై ఇప్పుడే చెప్పలేమని జ్వరం కాని లేదా ఇతరత్రా లక్షణాలు కనిపిస్తే వైద్యం చేస్తామని వైద్యులు వారికి సర్ది చెప్పారు.

వాక్సిన్ తీసుకునేందుకు వెళ్లిన వారు చాలా జాగ్రత్తగా ఇలాంటివి పరిశీలిస్తు ఉండాలి. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిని ప్రశ్నించి అప్రమత్తం చేయాలి. అంతటా  నిర్లక్ష్యం వహించే సిబ్బంది ఉండక పోవచ్చు కాని మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. 



 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు