సాగు నీటి విషయంలో కెసిఆర్ వి పచ్చి అబద్దాలు - పొన్నాల లక్ష్మయ్య

 నిపుణులతో చర్చలకు రా ముఖం చెల్లకుంటే నిపుణులను పంపు
మాజి మంత్రి పొన్నాల లక్ష్మయ్య సవాల్


తెలంగాణ సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పచ్చి అబద్దాలు చెబుతున్నాడని  మోసపూరిత మాటలు మాట్లాడుతున్నాడని కాంగ్రేస్ పార్టి సీనియర్ నేత మాజి మంత్రి  పొన్నాల లక్ష్మయ్య విమర్శించాడు. 

నాగార్జున సాగర్  ఉప ఎన్నికల సందర్భంగా కెసిఆర్ హాలియాలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో కాంగ్రేస్ పార్టీపై చేసిన విమర్శలను పొన్నాల లక్ష్మయ్య తప్పు పట్టారు. సోషల్ మీడియా వేదిక అయిన ఫేసు బుక్ లైవ్ లో పొన్నాల లక్ష్మయ్య కెసిఆర్ చేసిన విమర్శలనుద్దేశించి  మాట్లాడారు.

ముఖ్యమంత్రి అయిన ఏడు సంవత్సరాల వరకు కూడా నాగార్జున సాగర్ నియోజకవర్గం తెలంగాణ లో ఉన్నదా లేదా అనే విషయం తెలవదు అన్నట్టుగా ఉందని

ఇప్పుడే తెలుసుకున్నట్లుగా నాగార్జునసాగర్ లో అభివృద్ధి సరిగా లేదని అపవాదు వేసే దౌర్భాగ్య స్థితికి  ముఖ్యమంత్రి వచ్చాడని విమర్శించాడు.  ఏడు సంవత్సరాల నుంచి నాగార్జున సాగర్ నియోజకవర్గం కెసిఆర్ కు కనపడ లేదా అని పొన్నాల ప్రశ్నించాడు. భిక్షమెత్తి అయినా లిఫ్టు ఇరిగేషన్ పూర్తి చేయిస్తానని కెసిఆర్ ఎన్నికల సమయంలో  మాట్లాడటం ప్రజలు నమ్మరని అన్నారు.

తెలంగాణ వస్తే దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని అట్లాగే మైనార్టీలకు తమిళ నాడు తరహాలో  12 శాతం  రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పి 81 నెలలు కావచ్చినా ఏం చేయలేదని ఇవన్ని మోసాలు కాదా అని ప్రశ్నించారు.

ఆనాడు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చి ఉంటే గులాబి జెండా ఎగురేసే వాడివా  అని ప్రశ్నించాడు. కాంగ్రేస్ పార్టి అన్యాయం చేసిందని విమర్శలు చేసిన కెసిఆర్ గతంలో కాంగ్రేస్ పార్టీతో ఎందుకు పొత్తుకున్నాడని ప్రశ్నించాడు. అసెంబ్లి నిండు సభలో కెసిఆర్ సోనియా అమ్మ దయవల్లే తెలంగాణ వచ్చిందని చెప్పాడని 

సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇవ్వక పోతే ముఖ్యమంత్రి అయ్యే వాడివా అని ప్రశ్నించాడు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ బిల్లు పాసైందా అని ప్రశ్నించాడు.

2002 కన్నా ముందు ఇచ్చిన 50 రూపాయల పెన్షన్ ను బాగా రెట్టింపు చేసానని గొప్పలు చెప్పుకున్న కెసిఆర్ ఆనాడు ఏ పార్టీలో ఉన్నాడో ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలన్నారు.  ఆసుపత్రిలో 750 కిలో కాలరీల ద్రవాహారం తీసుకుని  దొంగ దీక్ష చేసిన కెసిఆర్ ఎందుకు మెడికల్ రిపోర్టు బయట పెట్టడం లేదన్నారు.  కోమటిరెడ్డికి మంత్రి పదవి ఇస్తానని జంగా అంజయ్య యాదవ్ కు పదవి ఇస్తానని చెప్పడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. ఓటమి భయంతోనే ఇవన్ని మాటలు చెబుతున్నాడని విమర్శించాడు.

కాంగ్రేస్ పార్టి అధికారంలో ఉండగా ఫేస్ వన్, టూ,త్రీ కింద ఫ్లోరైడ్ పీడిత నల్గొండ జిల్లాలో 95% గ్రామాలకు తాగు నీరిచ్చి జిల్లాను ఫ్లోరైడ్ రహిత జిల్లాగా చేసినఘనత కాంగ్రేస్ పార్టీదే నని అట్లాగే హైదరాబాద్ కు మూడు దశలుగా తాగు నీరిచ్చిన ఘనత కూడ కాంగ్రేస్ పార్టీదే నని అన్నారు.

30 ఏళ్ల చరిత్రలో కెసిఆర్ గ్రామాలలో తాగు నీరిచ్చారా అని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో భగీరథ ఎందుకు చేర్చలేదో చర్చకు వస్తావా  అంటు ప్రశ్నించాడు. తెలంగాణ రాష్ట్రం అప్పులకుప్పగా మారందని అన్నారు. ఉన్న బడ్జెట్ అంతా వడ్డీలు చెల్లించేందుకే సరిపోతోందన్నారు. 

"యాదాద్రి పవర్ ప్లాంట్ ఎంతవరకు వచ్చింది..నువ్వు వచ్చిన తర్వాత ఒక యూనిట్ అయినా కరెంటు ఉత్పత్తి చేశావా..యాదాద్రిలౌ  ఎందుకు పెట్టావో తెలియదా.. అక్కడ నీళ్లు లేవు.బొగ్గు లేదు , దోచుకోవడానికి అక్కడ పెట్టావు...కృష్ణా నీళ్ళను జగన్ దొచుకు పోతూంటే నోరు ఎందుకు మెదపడం లేదు" అని ప్రశ్నించాడు. కృష్ణా నీటిని దోచుకుపోకుండా మహబూబ్ నగర్ లో  దాదాపు తొమ్మిది లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులు ప్రారంభిస్తే 2014లో సగం పనులు కాంగ్రేస్ హయాంలో పూర్తి అయితే ఈ ఏడు సంవత్సరాల్లో ఆ సగం పనులు కూడ పూర్తి చేయలేదని పొన్నాల విమర్శించాడు.

కెసిఆర్ ఆంధ్ర సిఎం జగన్ కు తలవంచాడని సంగమేశ్వర్ , పోతిరెడ్డిపాడు దగ్గర నీళ్లు దోచుకు పోతుంటే ఏరోజు నోరు విప్పలేదన్నారు. 

నాగార్జున సాగర్ ఇక్కడ కట్టేది లేకుండే నని కెసిఆర్ చెబుతున్నాడని సాగర్ జలాశయం ప్రపంచంలోనే అతి పెద్ద జలాశయ మని అన్నారు. నిపుణులు విజ్ఞుల సూచనల మేరకే కడతారని లక్ష ఎకరాలకు నీళ్లిస్తానని చెప్పి కాళేశ్వరం కట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఒక్క సుక్క నీరు అయినా ఇచ్చావా అని ప్రశ్నించారు. చేవెళ్లకు, ఆదిలాబాద్ కు నికర జలాలు రాకుండా అడ్డుకున్న కెసిఆర్ పాలేరు నుండి నాగార్జున సాగర్ కు గోదావరి నీళ్ళు తీసుకు వస్తానని మాయ మాటలు చెబుతున్నాడని పొన్నాల లక్ష్మయ్య దుయ్యబట్టారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు