కుంభ మేళాలో కరోనా కాటు - వేల మందికి పాజిటివ్

 ప్రతి రోజు 50 వేల మందికి టెస్టులు  - ఏప్రిల్ 31 వరకు కొన సాగనున్న కుంభ మేళా


 కుంభ మేళా లో పుణ్యం కోసం గంగానదిలో మునకేయడం ఏమో కాని వెళ్లిన వారిలో అనేక మందిని కరోనా కాటేసింది. హ‌రిద్వార్‌, తెహ్రి, డెహ్రాడూన్ జిల్లాల్లో మొత్తం 670 హెక్టార్ల మేర కుంభ‌మేళ జ‌రుగుతోంది. లక్షలాది మంది గంగానదిలో పవిత్ర స్నానాలు చేసారు. కరోనా సెకండ్ వేవ్ దేశంలో విజృంభించినప్పటికి ప్రభుత్వం కుంభమేళా పై ఎలాంటి ఆంక్షలు విధించ లేదు. దాంతో ఉత్తరాఖండ్ లోని హరిద్వారా లో జరిగిన కుంభ మేళాలో కరోనా కేసులు జన సందడితో పాటే పోటెత్తాయి. లక్షలాది మంది దేశంలోని పలు ప్రాంతాల నుండి కుంభ మేళాకు రావడంతో ఇప్పటికే వేలాది మంది కరోనా భారిన పడ్డారు. ఏప్రిల్ 10 నుండి 14 వ తేదీ వరకు కుభం మేళా జరిగింది. ఈ ఐదు రోజుల వ్యవధిలో 2,167  మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ జరిగింది. స్థానిక వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేెసారు. కుంభ మేళాలో పాల్గొన్న వారికి టెస్టులు చేస్తుండడంతో కరోనాకేసులు బయట పడుతున్నాయి. 

మార్చి 31 న హైకోర్టు ఇచ్చిన  ఆదేశాలతో కుంభ మేళాకు వచ్చిన వారికి  ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. రోజుకు 50 వేల టెస్టులు చేసారు. గంగానది పొడవూత స్నానవాటికల వద్ద ఈ టెస్టులు నిర్వహిస్తున్నారు. వందలాది మంది వైద్య సిబ్బంది, పోలీసులు  కుంభమేళా లోవిధులు నిర్వహిస్తున్నారు.  ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలతో పాటే ర్యాపిడ్ ఆంటి జెన్ టెస్టుల ఫలితాల ద్వారా కరోనా కేసుల నిర్దారణ జరిగిందని  హ‌రిద్వార్ చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ శంభుకుమార్ ఝా మీడియాకు వెల్లడించారు. ఇంకా చాలా టెస్టులకు సంభందించిన ఫలితాలు రావల్సి ఉందని కేసుల సంఖ్య 3 వేలు దాటవచ్చని ఆయన చెప్పారు. గడిచిన 24 గంటల్లో కుంభమేళాకు హాజరయ్యే వారిలో చాలా మంది కరోనా నిభందనలు పాటించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు ఎంతగా ఖఠినంగా వ్యవహరించినా ఎవరూ లెక్క చేయకుండా కుంభ మేళాకు హాజరవుతున్నారు. 

 వివిద రాష్ట్రాలలో కుంభ మేళాకు వెళ్లి వచ్చిన వారికి టెస్టులు తప్పని సరి చేసారు. కర్నాటక రాష్ట్రంలో ప్రభుత్వం ఉత్తర్వులు కూడ  జారి చేసింది. కుంభ మేళాకు వెళ్లి వచ్చిన వారు టెస్టులు చేయించుకోని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పాజిటివ్ వచ్చిన వారు బయట తిరగ కుండా ఐసోలేషన్ లో ఉండాలని ఆదేశాలు జారి చేసింది. మిగతా రాష్ట్రాలలో కూడ కుంభ మేళాకు నుండి తిరిగి వచ్చిని గుర్తించి టెస్టులు చేయించాలని నిర్ణయించారు.

 కరోనా కేసుల నిర్దారణ తో ఉత్తరాఖండ్ ప్రభుత్వ యంత్రాంగం ఎంతగా అప్రమత్తం అయినా కరోనా నియంత్రణ కష్ట తరమైన వ్యవహారంగా మారింది. దాంతో అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేసారు.

కుంభ మేళాకు వచ్చే వారు తప్పని సరిగా కరోనా నిభందనలుపాటించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తిరత్ సింగ్ రావత్ పదే పదే  విజ్ఞప్తి చేసారు. ఏప్రిల్ 31 వరకు కుంభ మేళా కొనసాగనుంది. శశి స్నానాలు ఆచరించే దినాల్లో స్నాన ఘాట్ల దగ్గర జనం ఎక్కువగా ఉంటోంది. అయితే ముందే కుంభ మేళా ముగించే అవకాసం లేక పోవడంతో ప్రత్యామ్నాయ చర్యల కోసం ప్రభుత్వం ఆలోచిస్తోంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు