సిఎం పదవి ప్రజలు పెట్టిన భిక్ష - కెసిఆర్


తనకు సిఎం పదవి తెలంగాణ ప్రజలు పెట్టిన భిక్ష అని జానా రెడ్డి పెట్టింది కాదని  సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నేతలు బిచ్చగాళ్లలా పదవుల కోసం నోళ్లు మూసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సరిగా ఉంటే గులాబీ జెండా ఎగిరేదా అంటూ కెసిఆర్ ప్రశ్నించారు.  కాంగ్రెస్‌ నేతలు పదవుల కోసం తెలంగాణను వదిలి పెట్టారని కాని టిఆర్ెస్ మాత్రం తెలంగాణ కోసం పదవులు వదులు కుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కలను సాకారం చేసింది తానేనని చెప్పారు

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరడంతో సిఎం కెసిఆర్ బుధవారం హాలియాలో జరిగిన  బహిరంగ సభలో ప్రసంగించారు.

సభను అడ్డుకునేందుకు చాలామంది ప్రయత్నించారని  తాను సాగర్ ప్రజలను కలువ కుండా చేయాలని చూశారని విమర్శించారు. కాంగ్రేస్ అభ్యర్థి జానా రెడ్డిపై కెసిఆర్ తీవ్ర విమర్శలు చేసారు. జానా రెడ్డి మాట్లాడితే 30 సంవత్సరాలు అని అంటాడని తన హయాంలో ఒక్క డిగ్రీ కాలేజి కూడ ఏర్పాటు చేయ లేక పోయాడని విమర్శించాడు. 

నెల్లికల్లు లిఫ్ట్‌ ఇరిగేషన్ భిక్షమెత్తి అయినా పూర్తి చేస్తా మని నంది కొండలో డిగ్రీ కాలేజి ఏర్పాటు చేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో నోముల నర్సింహయ్య వారసునిగా భరత్ ను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.

ఓటర్లు ఆగం ఆగం కాకుండా ఆలోచించాలని ముళ్ల చెట్లు పెట్టి కాయలు కాయాలంటే కుదరదని ఓటు వేసే ముందు విచక్షణతో ఆలోచించి  ఓటేయాలని అన్నారు. వాస్తవాలన్నీ సాగర్ ప్రజల కళ్ల ముందున్నాయని  ఎవరు గెలిస్తే మంచిదో ఎవరు గెలిస్తే నియోజకవర్గం మంచిగా అవుతుందో మీకు ప్రజల కర్దమైందని నర్సింహయ్య ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తి అని ఆయన తనయుడు విద్యావంతుడైన నోముల భగత్‌ను నిలబెట్టామని ఇక్కడ భగత్ గాలి బాగానే ఉందని నాకర్థమైందని  ఈ గాలి 17వ తారీకుదాకా ఉండాలని కెసిఆర్ అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు