కరోనా నెగెటివ్ - ఆసుపత్రి ఆవరణలోనే తల్లి ఒడిలో మృత్యువులోకి

        వెంటాడుతున్న కరోనా  భయం                           

                                                 


కరోనా ఉధృతంగా ఉన్న వేల భయాందోళనలు ప్రాణాలకు ముప్పు కలుగ చేస్తున్నాయి. ఆసుపత్రి ఆవరణలో చెట్టుకింది తల్లి ఒడిలో మృత్యువు లోకి వెళ్ళిన యువకుడి సంఘటన అందరిని కలిచి వేసింది. కొడుకు మృత దేహం వద్ద రోదించిన ఆ మాతృమూర్తి  ఫోటో మీడియాలో చూసిన వారంతా చలించి పోయారు.   నిజామాబాద్ జిల్లా బోర్గాం గ్రామానికి చెందిన  30 ఏళ్ల ఆటో డ్రైవర్ అశోక్  గత కొద్ది రోజులుగా  తీవ్ర జ్వరంతో భాదపడుతున్నాడు. కరోనా టెస్టు చేయించారు.  ఫలితాల్లో నెగెటివ్ వచ్చింది. అయితే జ్వరం మాత్రం తగ్గ లేదు. దాంతో రెండో సారి కరోనా టెస్టు చేయించేందుకు రెంజల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తల్లి  గంగామణి తీసుకు వచ్చింది. ఆసుపత్రిలో కరోనా ర్యాపిడ్ టెస్టు చేయించారు. ఫలితం కోసం ఎదురు చూస్తు అసుపత్రి ఆవరణలో ఓ చెట్టు కింద కూర్చుని ఎదురు చూశారు. అంత లోనే కొడుకు చలనం లేకుండా కావడంతో తల్లి తట్టి చూసింది. అప్పటికే కొడుకు ప్రాణాలు పోయాయి. తల్లి రోదనలతో వైద్యుడు పరీక్షించి ప్రాణం పోయినట్లు దృవీకరించాడు. తీవ్ర జ్వరంలో భయాందోళన వల్ల గుండె పోటు వచ్చి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. ఆయన మరణించిన తర్వాత కరోనా ఫలితం  వచ్చింది. కరోనా  నెగెటివ్ వచ్చినట్లు వెద్య సిబ్బంది తెలిపారు.  భయం మనస్సులో పెట్టుకోవడం వల్ల కూడ మరణాలు సంభవిస్తున్న సంఘటనలు అక్కడక్కడా జరిగాయి. అశోక్ మరణం కూడ అలాంటిదే. కరోనా వచ్చిన వారందరూ చనిపోలేదు. ధైర్యంతో వైద్యం చేయుంచుకుని వారం రోజుల్లోనే మామూలు ఆరోగ్యంతో బయట పడ్డారు. భయం వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.

కరోనా పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చిన పేషెంట్లు రిపోర్ట్స్ వచ్చిన  కొద్ది సేపటికే  చనిపోయిన సంఘటనలు అనేకం రాష్ట్రంలో పలు  చోట్ల జరిగాయి. భయాపడాల్సిన అవసరం లేదని ధైర్యంగ ఉండాలని భయం మనస్సులో పెట్టుకుంటే


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు