చైనా మేడ్ వాక్సిన్ ఎఫెక్ట్ - పాక్ ప్రధాని ఇమ్రాన్ కు కరోనా

 తీసుకున్న రెండు రోజులకే కరోనా భారిన పడిన ఇమ్రాన్ ఖాన్


పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు కరోనా సోకింది. కరోనా వాక్సిన్ తీసుకున్న తర్వాత ఇమ్రాన్ ఖాన్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ జరిగింది.  వాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా సోకడంతో అందరూ విస్తు పోతున్నారు. ఈ విషయాన్ని పాక్‌ వైద్య శాఖ మంత్రి ఫైజల్‌ సుల్తాన్‌ స్వయంగా ధృవీకరించారు.

ఇక్కడో విషయం ఉంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీసుకున్న  వాక్సిన్ ఏ దేశంలో తయారు అయిందో తెల్సా..చైనాలో తయారైన "సినోవక్ " అనే వాక్సిన్. "సినోవక్ " వాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న రెండు రోజుల అనంతరం ఇమ్రాన్ ఖాన్ కరోనా భారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హం క్వారెంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నారని  వైద్య మంత్రి ప్రకటించారు.

భారత్ కు దాయాది అయిన పాకిస్తాన్ ఇండియాలో తయారైన కరోనా వాక్సిన్ అవసరం లేదని నిరాకరించింది. చైనా నుండి వాక్సిన్ తెప్పించుకుంది. అయితే దేశ ప్రధాన మంత్రికే  వాక్సిన్ తీసుకున్న తదనంతరం కరోనా సోకడంతో భారత నెటిజెన్లు  సోషల్ మాడియాలో అటు చైనాను ఇటు పాక్ ప్రధానిని అడుకుంటున్నారు. చైనాలో తయారు అయ్యే వస్తువులు అన్ని నాసిరకంగా ఉంటాయని అట్లాగే వ్యంగ్యంగా కామెంట్లు పెట్టి నాసిరకం సరుకంటూ  ఎద్దేవా చేసారు.

పాకిస్తాన్ లో కరోనా వీర విహారం చేస్తోంది. పేదరికం అధికంగా ఉన్న దేశంలో వైద్య సదుపాయాలుకూడ అంతంత మాత్రమే. గడిచిని 24 గంటల్లో 40 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు, శనివారం ఒక్క రోజు లోనే 3,876 మంది కరోనా భారిన పడ్డారు. దేశంలో ఇప్పటి వరకు  623,135 మంది కరోనా భారిన పడ్డారు. కరోనా సోకి చికిత్స పొందుతూ 13,799 మంది మృత్యు వాత పడ్డారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు