బిజెపీకి పట్టభద్రుల షాక్

 సిట్టింగ్ స్థానం కూడ కోల్పోయిన కమల నాధులు
రెండు స్థానాల్లోను ఎదురు దెబ్బలే 
మహబూబ్ నగర్,హైదరాబాద్,రంగారెడ్డి లో గట్టి పోటి ఇచ్చినా
నల్గొండ,ఖమ్మం, వరంగల్ లో నాలుగో స్థానం లోకి బిజెపి



పట్టభద్రుల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి భారి షాక్ తగిలింది. దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల్లో వరుస విజయాలు రికార్డు చేసిన బిజెపి అదే జోష్ లో పట్టభద్రుల ఎన్ని కల్లో కూడ రికార్డులు తిరగ రాయాలను కుంది కాని ఎదురు దెబ్బలు  తగిలాయి.  రెండు స్థానాల్లో మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి సిట్టింగ్ స్థానం కోల్పోయింది. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ లో గట్టి పోటి ఇవ్వలేక పోయింది.

నల్గొండ స్థానంలో భారత మాజి ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు కూతురు టిఆర్ఎస్ పార్టి అభ్యర్థి అయిన వాణి దేవి గెలిచారు. మూడు రోజుల పాటు ఉత్కంఠగా జరిగిన కౌంటింగ్ లో ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసిన అనంతరం సురభి వాణిదేవికి  1,49,269 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్థి రాంచందర్‌రావుకు వచ్చిన మొత్తం ఓట్లు 1,37,566 కాగా వాణి దేవి 20 వేలకు పైగా భారి అధిక్యత సాధించింది.

ఇక వరంగల్, నల్గొండ, ఖమ్మంలో కూడ టిఆర్ఎస్ అభ్యర్థి పల్ల రాజేశ్వర్ రెడ్డి విజయం సాదించారు. ఇక్కడ బిజెపి గట్టి పోటి ఇవ్వలేక నాలుగో స్థానం లో నిలిచింది. అధికార పార్టీ అభ్యర్థి పల్లాకు ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గట్టి పోటి ఇచ్చారు. మల్లన్నకు భారి స్థాయిలో ఓట్లు పోలు కావడంతో ఆయన రెండో స్థానంలో నిలిచారు.

మోత్తానికి  భారతీయ జనతా పార్టీకి పట్టభద్రుల ఎన్నికలు అచ్చి రాలేదు.  హైదరాబాద్ స్థానంలో పాత అభ్యర్థినే మూడో సారి నిలపడం వల్ల గట్టి పోటి ఇచ్చినా ఓటమి చెందారనే టాక్ వినిపిస్తోంది. నల్గొండ స్థానంలో బిజెపి అభ్యర్థి విషయంలో మొదటి నుండి అసంతృప్తులు ఉన్నాయి. పోటీలో నిలిచిన ఇతర పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులతో పోలిస్తే  ఈ స్థానంలో  ప్రేమేందర్ రెడ్డి సరైన అభ్యర్థి కాదనే అభిప్రాయాలు వెలువడ్డాయి. తీన్మార్ మల్లన్నతో పాటు, ప్రొఫెసర్ కోదండరాం కు భారీగా ఓట్లు పోలయ్యాయి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు