రాముడికి కాశాయ కండువా ?

బెంగాల్ ఎన్నికల సభల్లో మారు మోగనున్న జై శ్రీ రాం నినాదాలు


పశ్చిమ బెంగాల్ లో ఎట్లాగైనా అధికారంలోకి రావాలని శత విధాలా ప్రయత్నాలు చేస్తున్న భారతీయ జనతా పార్టి  ఏ ్వకాశాన్ని వదలడం లేదు.మనుషుల పేరిట, పార్టి పేరిట, దేవుడి పేరిట, పథకాల పేరిట అన్ని రకాల ఓటర్లను సమ్మోహితులను చేస్తోంది. రామాయణం బుల్లి తెర ఫేం అరుణ్ గోవిల్ ను తాజాగా పార్టీలోకి ఆహ్వానించింది. డిల్లలోని పార్టి కార్యాలయంలో అరుణ్ గోవిల్ గురువారం బిజపిలో చేరారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లో పలువురు సెలబ్రెటీలను, నటులను బిజెపి లోకి చేర్చుకున్నారు.

శ్రీరాముడిగా పేరొందిన అరుణ్ గోవిల్ 1987లో ప్రసారమైన ప్రముఖ ధారావాహిక రామాయణ్లో శ్రీరాముడిగా నటించారు. ఈ సీరియల్ అప్పట్లో బాగా పాపులర్ అయింది. దూరదర్శన్ లో ప్రసారం అయిన మహాభారత్ సీరియల్ కు  తర్వాత  రామాయణం అత్యధిక రేటింగ్ సంపాదించాయి.  లాక్ డౌన్ నేపద్యంలో పలు టివి ఛానెళ్లు వీటిని పున ప్రసారం చేస్తున్నాయి. అరుణ్ గోవిల్ రామాయణం సీరియల్ అనంతరం పలు సినిమాల్లో నటించారు. రామాయణం లో పోషించిన రాముడి పాత్ర ప్రబావంతో ఆయన పౌరాణిక పాత్రలకు పరిమితం అయ్యారు.

ఇప్పుడు అరుణ్ గోవిల్ చేయాల్సిన ఏమిటంటే బిజెపి ఎన్నికల సభల్లో జై శ్రీ రాం అని నినాదాలు ఇచ్చి ప్రజల చేత ఇప్పించడం. జై శ్రీరాం నినాదాలు చేయడంలో ఎలాంటి తప్పులేదని అరుణ్ గోవిల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని, ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు తాను బీజేపీలో చేరినట్లు ట్విట్టర్ వేదకిగా అరుణ్ గోవిల్ పేర్కొన్నారు. బిజెపి ఈ దేశంలో రాముడి పేరుతోనే రాజకీయాల్లో రాణించింది. పశ్చిమ బెంగాల్ లో రాముడి పేరుతో ఓట్లు రాబట్టుకోవాలని చోస్తోంది. 

అరుణ్ గోవిల్ గతంలో కాంగ్రేస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. రామాయణంలో సీతగా నటించి పాపులర్ అయిన నటి దీపికా ఛిఖాలియా, రావణా సురిడిగా నటించిన అరవింద్ త్రివేది కి బిజెపి టెకెట్లు ఇచ్చింది. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు