మహా హోం మినిస్టర్ పై మాజి డిజిపి మహాభియోగం

 


మహారాష్ట్ర హం మినిస్టర్ అనిల్ దేశ్ ముఖ్ పై  ముంబయి మాజీ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ మహాభియోగం మోపారు.  తనను నెలకు రూ 100 కోట్లు వసూలు చేయాలని హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఆదేశించారని మాజి డిజిపి పరంబీర్ సింగ్ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు లేఖ రాసారు. భారత కార్పోరేట్ దిగ్గజం దిగ్గజం అంబాని ఇంటి వద్ద కారు బాంబు కేసులో డిజిపి పరం బీర్ సింగ్ విచారణ సరిగ్గా జరప లేదని ఆయనను బదిలి చేసారు.

ముంబయి క్రైమ్‌ ఇంటిలిజెన్స్‌ యూనిట్‌ హెడ్‌గా ఉన్న వాజేను హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ కొన్ని నెలలుగా పలుమార్లు తన నివాసానికి పిలిపించుకున్నారని పరంబీర్‌ తన లేఖలో పేర్కొన్నారు. నిధులు నెల నెలా సేకరించి ఇవ్వాలని వత్తిడి చేసారని ఆరోపించారు. నెలకు వంద కోట్ల రూపాయల మామూళ్ల లక్ష్యం నెర వేర్చాలని చెప్పన సమయంలో మంత్రి వ్యక్తి గత సిబ్బంది కూడ ఉన్నారని మాజి డిజిపి లేఖలో  పేర్కొన్నారు. మాజి డిజిపి చేసిన ఆరోపణలు మహారాష్ర్టలో కల కలం రేపాయి. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఇంకా ఈ ఆరోపణలపై స్పందించ లేదు. హాం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ కూడ కౌంటర్ ఇవ్వలేదు. ఓ మాజి డిజిపి ఆరోపణలు చేయడం అది మామూళ్ల కోసం హోం మంత్రి  దందాను బయటపెట్టడం సంచలనంగా మారింది. మాజి ిజిపి కేవలం హోం మంత్రిపై కోపంతో ఇట్లా  విషయం బయట పెట్టారా ముఖ్యమంత్రి స్పందన ఏమిటి విచారణకు ఆదేశిస్తారా ఏం జరుగుతుందో చూడాలి.

మాజి డిజిపి చేసిన ఆరోపణలపై  తక్షణం విచారణకు ఆదేశించాలని మాజి ముఖ్య మంత్రి దేవేంద్ర ఫఢ్నవీస్ డిమాండ్ చేసారు. హోం మంత్రి రాజీనామా చేయాలని లేదా ముక్యమంత్రి ఆయన్ని బర్తరఫ్ చేయాలని అన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు