గురుకులాల్లో కరోనా కల కలం - మూసి వేసే దిశగా ప్రభుత్వం

 


తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల్లో కరోనా ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు పాఠశాలల్లో విద్యార్థులు కరోనా భారిన పడ్డారు.  నగరం లోని హయాత్ నగర్ గురుకుల జూనియర్ కాలేజి హాస్టల్ లో విద్యార్థులకు కరోనా సోకింది.  పాఠశాలలో  పనిచేసే నలుగురు సిబ్బంది కరోనా భారిన పడ్డారు. పాఠశాలలో చదువుతున్న 37 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. కళాశాలలో 400 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి పరీక్షలు నిర్వహించగా నలుగురు సిబ్బందితో పాటు విద్యార్థులకు కరోనా సోకడంతో వారిని హేం క్వారెంటైన్ లో ఉంచి వైద్య చికిత్స అందిస్తున్నారు.

రోజు రోజుకూ పాఠశాలల్లో కరోనా వ్యాప్తి పెరగడంతో పాఠశాలలు, కళాశాలలు తిరిగి మూసి వేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. 

ఖమ్మం జిల్లా ముది గొండ మండలం పెద్దమండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 11 మంది విద్యార్థులకు కరోనా సాకింది. పాఠశాలలో 88 మంది విద్యార్థులకు రోనా టెస్టులు నిర్వహించగా పోజిట్వో కేసుుల వెలుగు చూశాయి. వీరిని ప్రభుత్వ అసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా పరిది లోని ఉయ్యాల వాడ జ్యోతి బా పూలే గురుకుల పాఠశాలలో 12 మంది విద్యార్థులకు కరోనా సోకింది. అంతకు ముందే నలుగురికి కరోనా సోకింది. 

రాష్ట్ర వ్యాప్తంగా  ప్రస్తుతం పనిచేస్తున్న గురుకుల పాఠశాలల్లో విద్యార్థులందరికి కరోనా టెస్టులు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారి చేసింది. కరోనా పాజిట్ గా నిర్దారణ అయిన విద్యార్థులను అసుపత్రులకు తరలించాలని ఆదేశించారు. ఒకటి రెండు రోజుల్లో పాఠశాలలు, కళాశాలల మూసి వేసే ఆలోచనపై నిర్ణయం తీసుకోనున్నారు. సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ, సోషల్ వెల్ఫేర్ గురుకులాలతో పాటు జ్యాతిబా పూరే పాఠశాలకు సెలవులు ప్రకటించే అవకాశాలను విద్యాశాఖ పరిశీలిస్తోంది. 

పదవ తరగతి, ఇంటర్ మీడియేట్ విద్యార్థులకు కరోనా నేపద్యంలో ఆన్ లైన్ బోదనలు చేపట్టే దిశగా ఆలోచనలు సాగుతున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు