ప్రజలు టిఆర్ఎస్ వైపే ఉన్నారు- అందుకే సంపూర్ణ మెజార్టీతో గెలిచాం - మంత్రి యెర్రబెల్లి దయాకర్ రావు

చౌక బారు ఎత్తుగడలతో బిజెపి ఇండ్లపై దాడులకు పాల్పడింది 
అయినా ప్రజలు బిజెపిని నమ్మలేదు
ఇప్పటికైనా బిజెపి పిచ్చి మాటలు మానుకోవాలి
ఏ పార్టి అభ్యర్థులు ఎందుకు ఓడారో మీడియా తేల్చాలి
తీన్మార్ మల్లన్నకు ఓట్లు బాగానే వచ్చాయని మల్లన్న నోట్లు పంచినట్లేనా 

                            పంచాయితి రాజ్ శాఖ మంత్రి  యెర్రబెల్లి                                                                                                                                                  దయాకర్ రావు



 ప్రజల మద్దతు  టిఆర్ఎస్ పార్టీకి  ఉంది కాబట్టే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో గెలిచామని రాష్ట్ర పంచాయితి రాజ్ శాఖ మంత్రి యెర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇప్పటికైనా బిజెపి పిచ్చి మాటలు మానుకోవాలని హితవు చెప్పారు. బిజెపిని ప్రజలు నమ్మలేదు అందుకే కొన్సిల్ లో బిజెపీకి స్థానం లేకుండా చేసారని యెర్రబెల్లి అన్నారు.

ఎమ్మెల్సి పట్టభద్రుల ఎన్నికల్లో రెండు స్థానాలలో టిఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాదించిన సందర్బంగా  ప్రభుత్వ చీఫ్ విప్  వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, జనగామ  జెడ్పి  చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, పార్టి నాయకు రాలు డాక్టర్ హరి రమాదేవి తదితరులతో కలిసి ఆదివారం మీడియాతో మాట్లాడారు.

బిజెపి రెచ్చగొట్టే చర్యలను ప్రజలు తిప్పు కొట్టారని అన్నారు. తన ఇంటితో పాటు  టిఆర్ఎస్  ఇండ్లపై దాడులు చేసి రెచ్చగొట్టి లబ్ది పొందాలని చౌక బారు ఎత్తుగడలకు పాల్పడ్డారని దయాకర్ రావు దుయ్య బట్టారు. 

కేంద్రంలో అధికారంలో ఉన్న  బిజెపి  విభజన చట్టంలో ఉన్న హామీలు ఎందుకు అమలు చేయలేదని  ప్రశ్నించారు. ఎన్నికల్లో అనేక పార్టీలు వ్యక్తులు పోటీ చేసినా కాంగ్రేస్, తెలుగుదేసం పార్టీలను కాదని  అందరిని ఓడించి ప్రజలు టిఆర్ఎస్ నే తమ ఇంటి పార్టీగా గుర్తించి ఓట్లేసారని అన్నారు.  ప్రభుత్వం తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలకు కట్టబడి ఉందని అన్నారు. ప్రబుత్వ ఉద్యోగులకు పిఆర్ సి ఇస్తామని అన్నారు. ఉద్యోగాల కల్పన విషయంలో కూడ ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు. 

ఎమ్మెల్సి ఎన్నికల్లో  ఏ పార్టి అభ్యర్థులు ఎందుకు ఓడారో మీడియా తేల్చాలని అన్నారు.  ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు బిజెపి, కాంగ్రేస్ పార్టీల నేతలే సహకరించారని అందుకే మల్లన్నకు భారి ఓట్లు పోలయ్యాయని ఆయా పార్టీల నేతలే ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని అన్నారు.

 పోలింగ్ బూతులలో అన్ని పార్టీలు ఏజెంట్లు ఉండగా దొంగ ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయని విమర్శలు చేస్తున్నారని దయాకర్ రావు మీడియా వారు ఆడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. నోట్లు పంచితేనే ఓట్లు పడ్డాయని పట్టభద్రులను అవమానించడం సరికాదని అన్నారు. మల్లన్నకు ఓట్లు బాగా నే వచ్చాయని ఆ లెక్కన  మల్లన్న కూడ నోట్లు పంచినట్లేనా అని ప్రశ్నించారు. ఓడి పోవడం ఓటర్లను అవామానించడం కాంగ్రేస్, బిజెపి లకు అలవాటేనని అన్నారు.

వరగంల్ నగరాభి వృద్ధి కోసం సిఎం కెసిఆర్ రెగ్యులర్ గా ఇచ్చే నిధులతో పాటు అదనంగా 250 కోట్లు ఇచ్చారని అట్లాగే వరదల్లో దెబ్బ తిన్న రోడ్లకు 300 కోట్లు ఇచ్చారని చిత్త శుద్దితో నగరాభి వృద్ధి కోసం నిధులు మంజూరు చేశారని అన్నారు. సిఎం కెసిఆర్ పట్ల ప్రజలకు స్పష్టత ఉందని ప్రజల అండదడంలే టిఆర్ఎస్ కు శ్రీ రామరక్ష అని అన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు