ఇదేం న్యాయం శేఖర్ కమ్ముల- తెలంగాణ కోమలకు అవకాశం ఎందుకు ఇవ్వలే

ప్రశ్నిస్తున్న తెలంగాణ సమాజం

 


నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లవ్ స్టోరి మూవీలో వరుసగా పాటలు రీలీజ్ చేస్తు మిలియన్ల కొద్ది వ్యూస్ సంపాదిస్తున్నారు. ఈ చిత్రంలో  ఓ తెలంగాణ సింగర్ కు శేఖర్ కమ్ముల అన్యాయం చేసాడనే విమర్శలు వచ్చాయి. 

 అదే ఆ పాట.. దాని పేరే సారంగ ధరియా అనే పాట తెలంగాణ లో ఎంత ఫేమసో  అందరికి తెల్సు. తెలంగాణ గల్లి గల్లీలో మారు మోగిన ఈ పాట వినని వారంటూ ఎవరూ ఉండరు. రేలా రేలా సింగర్ కోమల తన గొంతు తో మొదటి సారిగా ఈ పాట వినిపించి అందరిని చేత స్టెప్పులు వేయించింది.. ఆ తర్వాత అనేక మంది  ఫోల్క్ సింగర్లు రక రకాల వీడియో మిక్సింగులతో పాటను  పాడారు. అయితే కోమల గొంతు నుండి వెలువడిన మొదటి బాణి సమకూర్చింది ఎవరో కాని పాటకు ప్రాణం పోసింది.  కోమల గొంతు తో జత కలిసి తెలంగాణ గల్లి గల్లి గజ్జ కట్టింది. 

ఇదంతా మరుగున పడిపోయేలా శేఖర్ కమ్ముల తన లవ్ స్టోరి మూవీలో సరికొత్తగా పాటను ట్యూన్ చేయించాడు. అయితే ఇందులో కోమలకు బదులుగా ఆయన మంగ్లీతో పాట పాడించాడు.  కోమలతో పాట పాడిస్తే ఆమెకు న్యాయం చేకూర్చినట్లు ఉండేది. కాని ఎందుకో శేఖర్ కమ్ములకు ఆమె తెలంగాణ సింగర్ కావడం వల్ల ఎక్కడో అహం అడ్డువచ్చి ఉండవచ్చని తెలంగాణ వాదులు మండి పడుతున్నారు. కళాకారులకు, సింగర్లకు ప్రాంతీయత అంటగట్టడం తగదు కాని వారి అస్తిత్వాన్ని కూడ సినిమా పరిశ్రమ  గుర్తించాలి కద. కోమలకు ఈ పాట పాడే అవకాశం దక్కితే తెలంగాణ సమాజం చాలా గర్వపడి ఉండేది. కాని శేఖర్ కమ్ములకు ఎందుకో ఆ అలోచన రాలేదా లేక తెలంగాణ వారు పాటకు పనికి రారని అనుకున్నారా తెలంగాణ కోమలకు  ఎందుకు అన్యాయం చేశారో వివరణ ఇవ్వాలి.

పాటను మొదటి సారిగా తన గొంతుతో వినిపించిన కోమలకు శేఖర్ కమ్ముల కేవలం ఓ ధాంక్స్  పడేసి ఊరుకున్నాడు. లవ్ స్టోరీ మూవి సారంగ ధరియా పాట విడుదల  అయిన తర్వాత ఆయన ట్విట్టర్ లో ఏం పోస్టు చేశాడో మీరే చదవండి.

తెలంగాణ జానపద గీతం సారంగ దరియాకి సరి కొత్త సొగసులు అద్ది, తనదైన ముద్రతో మనకి అందించిన " సుద్దాల గారికి " వేల దండాలు..మీరు సూపర్ సర్..."కాళ్ళకు ఎండి గజ్జెల్  లేకున్న నడిస్తే ఘల్ ఘల్..దాని సెంపల్ ఎన్నెల కురియా..దానిసెవులకు దుద్దుల్ మెరియా..అది రమ్మంటె రాదుర సెలియా..దానిపేరే సారంగ దరియా..

కిర్రాక్ సంగీతాన్ని అందించిన పవన్ కి..అద్భుతంగా డాన్స్  చేసిన సాయి పల్లవికి..చేయించిన శేఖర్ మాస్టర్ కి..పాడిన మంగ్లీకి ధాంక్యూ..ధాంక్యూ. ఇదంతా సాద్యం చే సిన మా టీంకి వేల థాంక్స్..అంటూ చివరగా ఈ పాటని మొదటగా సేకరించి మనకి అందించిన రేలారే "కోమలకి" థాంక్స్ అంటూ శేఖర్ కమ్ముల పోస్ట్ చేసాడు.  సారంగ ధరియా పాట కోమల బాగా పాడిందా లేక మంగ్లి బాగా పాడిందా అనేది ఇక్కడ సమస్య కాదు ఇద్దరూ మంచి సింగర్లు. కాని కోమలకు అవకాశం ఇస్తే న్యాయం జరిగేది అనేదే శేఖర్ కమ్ములకు ఎత్తి చూప దల్చిన పాయింట్. తెలంగాణ కళాకారులకు అసలే అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. వచ్చిన అవకాశాలు అయినా వారికి దక్క నీయండి.

ఆరోగ్య సమస్య వల్లే పాడ లేక పోయా కోమల

తన నాయనమ్మ దగ్గర నేర్చుకున్న పాట ఆరోగ్య సమస్య కారణంగానే కోమల పాడే అవకాశం కోల్పోయిందని  న్యూస్ మినట్  వెబ్ సైట్  కథనాన్ని ప్రచురించింది. పాట కోసం తనను  సంప్రదించారని కోమల పేర్కొన్నట్లు కథనంలో పేర్కొన్నారు. ముందు ముందు సినిమాల్లో పాడే అవకాశం కల్పించాలని శేఖర్ కమ్ములను కోరి నట్లు కోమల తెలిపింది.

పాటను పంట పొలాల్లో పనులు చేస్తూ పాడే వారమని కోమల వివరించింది. 2010 లో టి న్యూస్ నిర్వహించిన జానపద పాటల పోటీల్లో కోమల మొదటి సారిగా పాడి  పాపులర్ చేసింది.  సుద్దాల ఆశోక్ తేజ జడ్జిగా పాల్గొన్న కార్యక్రమంలో కోమల పాట విని బాగా ఇంప్రెస్ అయినట్లు ది  లవ్ స్టోరి మూవీ లో  తన  పాట ఇంతగా పాపులర్ అయ్యేందుకు సుద్దాల అశోక్ తేజ కారణని కోమల సంతోషం వ్యక్తం చేసినట్లు టిఎన్ఎం వివరించింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు