భాదితురాలి తండ్రిని కాల్చి చంపిన రేప్ కేసు నిందితుడు

 హత్రాస్ లో ఘోరం

బెయిల్ పై బయటికి వచ్చిన నిందితుడు 

 

లైంగిక వేదింపుల కేసు ఎదుర్కుంటున్న నిందితుడు యువతి తండ్రిని కాల్చి చంపిన ఘటన ఉత్తర ప్రదేశ్ జిల్లా హత్రాస్ లో సోమవారం జరిగింది. గౌరవ్ శర్మ అనే వ్యక్తి 2018 జులైలో ఓయువతిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి గౌరవ్ శర్మను జైళుకు పంపారు. నెల రోజుల తర్వాత గౌరవ్ బెయిల్ పై తిరిగి వచ్చి అప్పటి నుండి గ్రామంలోనే ఉంటున్నాడు.

సోమవారం గ్రామం బయట ఉన్న ఓ దేవాలయంలో  గౌరవ్ శర్మ తన భార్య అత్తతో కల్సి  వెళ్లారు.  అక్కడికి బాదితురాలి తండ్రి రావడంతో ఆయనతో వాదన పడ్డారు. వాగ్వాదం జరుగుతుండగా గౌరవ్ శర్మ తన వాళ్ళను కేకేసి పిలిపించాడు. భాదితురాలి తండ్రి పై ఎగ బడి కొట్టి కాల్పులు జరిపాడు. దాంతో తీవ్ర గాయాల పాలైన యువతి తండ్రిని అసుపత్రికి తరలిస్తుండగా మార్గ మద్యంలో చనిపోయాడు.

పోలీస్ స్టేషన్ ఎదుట తనకు న్యాయం చేయాలంటూ మృతుడి కూతురు  బిగ్గరగా ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసారు. గౌరవ్ శర్మ మరో ఏడుగురు మనుషులు కల్సి  అన్యాయంగా తన తండ్రిని పొట్టన  పెట్టుకున్నరని ఆ యువతి ఏడుస్తు చెప్పింది.

ఖఠిన చర్యలు తీసుకుంటామని ఈ ఘటనకు సంభందించి పోలీస్ చీఫ్ వినీత్ జైస్వాల్ తెలిపారు. హత్యకు సంభందించి ఒకరిని అరెస్ట్ చేసామని మిగత వారి కోసం గాలిస్తున్నామని  తెలిపారు.

 గత ఏడాది హత్రాస్ లో ఓ యువతి పై నలుగురు యువకులు లైంగిక వేధింపులకు పాల్పడి హత్య చేసిన సంఘటన దేశ వ్యాప్తంగా కల కలం రేపింది. ఉన్నత కులాలకు చెందిన యువకులు కింది కులం యువతిపై ఈ దారుమానికి ఒడి గట్టడంతో దేశ వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఈ ఘటన పై ముక్యమంత్రి ఆదిత్యనాద్ యోగి స్వయంగా సిబిఐ దర్యాప్తు కోరడంతో ప్రస్తుతం సిబిఐ విచారణ జరుగుతోంది.

ఉత్తర ప్రదేశ్ లో దేశంలో కెల్ల అత్యధికంగా లైంగికి వేధింపుల కేసులు నమోదు అయ్యాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు