కుబేరుల జాబితాలో జూపల్లి రామేశ్వర్ రావు

 కుబేరుల్లో పలువురు  ఫార్మా కంపెనీల యజమానులే 


తెలంగాణ లో కూడ పెట్టుబడి దారుల సంపదలు పోగవుతున్నాయి.  హైదరాబాద్ లో ఉన్న 10 మంది సంపన్నుల జాబితాల్లో  ఫార్మా ఇండస్ట్రీకి చెందిన దిగ్గజాలు ఎక్కువగా ఉన్నారు. హురున్‌ ప్రపంచ కుబేరుల జాబితా-2021లో నగరానికి చెందిన 10 మంది లో మురళి దివీ. దివీస్‌ ల్యాబోరేటరీస్‌. రూ.54,100 కోట్ల నెట్‌వర్త్‌తో భారత్‌లో 20వ స్థానం అదే ప్రపంచవ్యాప్తంగా 385వ స్థానంలో నిలిచారు. 

పీవీ రాంప్రసాద్‌ రెడ్డి. అరబిందో ఫార్మా. రూ.22,600 కోట్ల నెట్‌వర్త్‌తో భారత్‌లో 56వ స్థానం అదే ప్రపంచవ్యాప్తంగా 1,096వ స్థానంలో ఉండగా కె. సతీశ్‌రెడ్డి. డాక్టర్‌ రెడ్డీస్‌. రూ.12,800 కోట్ల నెట్‌వర్త్‌తో భారత్‌లో 108వ స్థానం, ప్రపంచవ్యాప్తంగా 2,050వ స్థానంలో ఉన్నారు. జీవీ ప్రసాద్‌ అండ్‌ జి. అనురాధ. డాక్టర్‌ రెడ్డీస్‌. రూ.10,700 కోట్ల నెట్‌వర్త్‌తో భారత్‌లో 133వ స్థానం, ప్రపంచవ్యాప్తంగా 2,238వ స్థానంలో ఉండగా

పి. పిచ్చి రెడ్డి. మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌. రూ.10,600 కోట్ల నెట్‌వర్త్‌తో భారత్‌లో 134వ స్థానం, ప్రపంచవ్యాప్తంగా 2,383వ స్థానంలో నిలిచారు. అట్లాగే జూపల్లి రామేశ్వర్ రావు మై హోం ఇండస్ట్రీస్‌. రూ.10,500 కోట్ల నెట్‌వర్త్‌తో భారత్‌లో 138వ స్థానం, ప్రపంచవ్యాప్తంగా 2,383వ స్థానంలో ఉన్నారు. అట్లాగే  పీ.వీ. కృష్ణారెడ్డి. మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌. రూ.10,200 కోట్ల నెట్‌వర్త్‌తో భారత్‌లో 140వ స్థానం, ప్రపంచవ్యాప్తంగా2,383వ స్థానంలో నిలిచారు. ఎం. సత్యనారాయణ రెడ్డి. ఎంఎస్‌ఎన్‌ ల్యాబోరేటరీస్‌. రూ.9,800 కోట్ల నెట్‌వర్త్‌తో భారత్‌లో 143వ స్థానం, ప్రపంచవ్యాప్తంగా 2,530వ స్థానంలో ఉండగా  వీసీ నన్నపనేని. నాట్కో ఫార్మా. రూ.8,600 కోట్ల నెట్‌వర్త్‌తో భారత్‌లో 164వ స్థానం, ప్రపంచవ్యాప్తంగా 2,686వ స్థానంలో ఉన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు