బస్త సంచులలో రూ.500 కరెన్సి- షాక్ తిన్న పోలీసులు


 నకిలి కరెన్సి తయారు చేసి మార్కెట్ లో చలామని చేసేందుకు ప్రయత్నించిన ఓ ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి  .7.90 కోట్లు వరకు రూ.500 నకిలినోట్లు స్వాదీనం చేసుకున్నారు.  ఇవన్ని బహిరంగ మార్కెట్ లో చలామని చేసేందుకు తీసుకు వెళ్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాల కోసం పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌ జిల్లా పొటాంగి పరిధిలోని సుంకీ అవుట్‌ పోస్టు వద్ద మంగళవారం పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ కారులో ఈ నకిలినోట్లు బయట పడ్డాయి. బస్తా సంచులలో నకిలి కరెన్సి నోట్లుపేర్చి ఉండడం చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఇంద పెద్ద ఎత్తున నగదును ఎక్కిడికి తరలిస్తున్నారో అర్దం కాకవారిని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ జరపగా అవన్ని నకిలి నోట్లని నిర్దారణ అయింది.
చత్తీస్ ఘడ్ రాష్ట్రం రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేటుతో ఉన్న కారు అందులో ముగ్గురు వ్యక్తులు రాయ్ పూర్ నుండి విశాఖ పట్నం వస్తున్నట్లు విచారణలో తేలింది.  విశాఖపట్నంలో ఈ నకిలి నోట్లను ఏ వ్యక్తికి అంద చేసేందుకు వచ్చారో నిందితుల పోలీసులకు వెల్లించారని సమాచారం. అయితే విచారణ గోప్యత దృష్ట్యా పోలీసులు ఇంకా పూర్తి వివరాలు వెల్లడించ లేదు. కేసు విచారిస్తున్నారు.
నోట్లను కలర్ జిరాక్స్ ద్వారా తయారు చేసారని అసలునోట్లమాదిరిగా బండిల్స్ కట్టారని ఎస్పీ గుంటుపల్లి వరుణ్‌ తెలిపారు.
ఈ నోట్లన్ని గ్రామీణ ప్రాంతాలల్లో  మార్కెట్ లో చలామని చేసేందుకా లేక నకిలి కరెన్సి ఆశ చూపి అసలు కరెన్సి కొట్టేసేందుకా అ నే విషయాలు పోలీసులు విచారణలో వెల్లడి కానున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు