మాజి రంజి క్రికెటర్..పిఏ అవతారం ఎత్తి లక్షల్లో వసూలు

 పోలీసుల అదపులో రంజీ  మాజి క్రికెటర్ - మంత్రి  కెటిఆర్ పేరు చెప్పి లక్షల్లో వసూలు




ఆయనో మాజి రంజి క్రికెటర్..పుట్టింది శ్రీకాకుళం జిల్లా లో..రంజి ట్రోఫీలో ఆడాడు. హైదరాబాద్ లో నివాస ముంటూ  ఘరానా మోసాలకు పాల్పడ్డాడు. ఐ.టి, మున్సిపల్  శాఖ మంత్రి కెటిఆర్  పవర్ బాగా ఉందని ఎక్కువగా ఆయన పేరు చెప్పి డబ్బులు వసూలు చేశాడు. ఎదుటి వారి పని తీరు అవసరాలను బట్టి  ఇతర శాఖల మంత్రుల పేర్లు చెప్పి వారి దగ్గర పిఏ నంటూ పనులు చక్కదిద్దుతానంటూ చెప్పి  లక్షల్లో వసూలు చేశాడు.

పలువురు మంత్రులకు పీఏ నంటూ వివిద కంపెనీలను నమ్మించి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిన ఓ వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పలువురు సీనియర్ మంత్రుల పేర్లతో పాటు ఐ.టి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ కు పీఏ నంటూ లక్షల రూపాయలు వసూలు చేసాడు. పోలీసులకు దొరికిన వ్యక్తిని శ్రీకాకుళం జిల్లా యవ్వారి పేటకు చెందిన మాజి రంజి క్రికెటర్ నాగరాజుగా గుర్తించారు. నిందితుడి నుండి రూ 10 లక్షలు స్వాదీనం చేసుకున్నట్లు సటి పోలీస్ కమీషనర్ అంజని కుమార్ శనివారం జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు.

హైదరాబాద్‌లో ఉంటూ కేటీఆర్‌ పీఏగా చెలామణి అవుతున్నాడని  వ్యాపారవేత్తలు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు నిందితుడు ఫోన్‌ చేసి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నాడని అందిన సమాచారం మేరకు నిఘా పెట్టి పట్టుకున్నామని అంజని కుమార్ తెలిపారు. నగరంలో పేరు మోసిన ప్రధాన కంపెనీలు, ఆసుపత్రులు, రియల్ ఎస్టేట్ సంస్థల ఫోన్ నెంబర్లు సేకరించి వారితో పరిచయాలు చేసుకుని పనులు చేయిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసేవాడని తెలిపారు. ఈ మద్య కె.టిఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడంటూ డబ్బులు వసూలు చేశాడని తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. సుమారు 9 నుండి 10 కంపెనీల వరకు నాగరాజు  39.22 లక్షలు వసూలు చేసినట్లు నిర్దారణ జరిగిందని ఇంకా ఎవరైనా వ్యక్తులు సంస్థలు డబ్బులు ఇచ్చి  ఉంటే పోలీసుల దృష్టికి తీసుకు రావాలని అంజనికుమార్ తెలిపారు.

2014 నుంచి 2016 వరకు రంజి క్రికెట్ ట్రోఫీలో ఆడిననాగరాజు అ తర్వాత సంపాదన లేక రక రకాలమోసాలకు పాల్పడ్డాడు. ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి పిఏ నంటూ పలు కంపెనీలకు ఫోన్లు చేసి రంజి క్రికెట్ క్రీడాకారలకు ఆర్థిక సహాయం కావాలంటూ డబ్బులు వసూలు చేశాడు. నెల్లూరు లో పోలీసులు అతన్ని గతంలో అరెస్ట్ చేశారు. జైళు జీవితం గడిపిన అనంతరం తిరిగి హైదరాబాద్ లో మకాం వేసి తాజాగా మోసాలకు పాల్పడ్డాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు