గుప్త నిధుల పేరిట మోసం చేసిన వ్యక్తుల అరెస్ట్

 


గుప్త నిధులు వెలికితీస్తామని జనాన్ని మోసం చేసిన ముఠా సబ్యులను సైబరాబాద్ పోలీసులు  అరెస్ట్ చేశారు. గత 15 సంవత్సరాలుగా నగరానికి చెందిన అబ్బాస్‌ అలీ, అక్బర్‌ తయ్యబీలు ఇద్దరు కల్సి గుప్త నిధులు వెలికి తీస్తామని ప్రజలను నమ్మించి మోసం చేసారు. వీరి నుండి రూ.5.85 కిలోల నకిలీ బంగారం. రూ.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ తెలిపారు.

మీరాలం మండికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇట్లో గుప్త నిధులు ఉన్నాయని కల రావడంతో వారు తెల్సిన విరిని విచారించి చివరికి  గుప్త నిదులు వెలికి తీసే వారిని ఆశ్రయించారు. 

నిధులు వెలికి తీయాలంటే 5 లక్షలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్సుగా 3 లక్షలు తీసుకున్నారు. ఇంట్లో పూజలు చేసి నాలుగు గోతులు తవ్వి ఇంట్లో వారి ఏ మార్చి   ఓ గోతిలో బంగారు  పూత పూసిన బిస్కెట్ల మూటను ఉంచారు. అనంతరం వారి చేత గోతులు తవ్వించి గుప్త నిధుల కోసం వెదికించారు. మూడు గోతులలో ఏం లభించ లేదు కాని నాలుగో గోతిలో ఓ మూట దొరికింది.  లభించింది. నిజంగా గుప్త నిధుల మూటేనని ఇంటి వారు నమ్మారు. మరో రెండు రోజుల వరు మూటను తెరవ వద్దని గుప్త నిధులు వెలికి తీసే వారు చెప్పారు. మరో సారిపూజ కూడ చేసారు. అయితే ఉస్తాహం ఆపుకోలేక ఇంటి వారు మూటను తెరిచి చూసి అందులో లభించిన బంగారు పూత పూసిన బిస్కెట్లను పరీశీలించారు. వారికి అనుమానం వేసి వాటిని గోల్డ్ స్మిత్ చేత పరీక్షించారు. అవి నకిలి గోల్డ్  బిస్కెట్స్ అని నిర్దారణ కావడంతో మోసం చేశారని గుప్త నిధులు వెలికి తీసే వారిని నిల దీసారు. తమ తప్పేం లేదని మరో రెండు రోజులు పూజలు చేయాల్సి ఉండగా తొందర పడి మూట తెరవడం వల్ల ఇలా జరిగిందని బుకాయించే ప్రయత్నం చేశారు. దాంతో ఇంటి యజమాని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి పూర్తి వివరాలు రాబట్టి  నిందితులను అరెస్టు చేశారు. 

ఈ కేసులో మొత్తం నలుగురిని అరెస్టే చేశామని పోలీసులు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు