కోల్ బెల్టులో డాక్టర్ చెరుకు సుధాకర్ ప్రచారం

 త్యాగధనుల వారసునిగా గెలిపించండి
వాకర్స్, బొగ్గు బావిపై, జెన్కో లలో ప్రచారం

   


తుది దశ తెలంగాణ ఉద్యనానికి తొలికేక పెట్టి ఎన్ని కష్టాలు ఎదురైన, పి.డి యాక్ట్ పెట్టి జైల్లో పెట్టినా  తెలంగాణ రాష్టం సాధించేవరకు మడమ తిప్పని ఉద్యమం కొనసాగించిన తాను తెలంగాణ ప్రజల పక్షాన ఎమ్మెల్సి ఎన్నికల బరిలో నిలిచానని   పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని  డాక్టర్ చెరుకు  సుధాకర్ విజ్ఞప్తి చేశారు. 

   నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు రోజుల పాటు  భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆట పాట తో పాటు ప్రధాన కూడళ్లతో పాటు జయశంకర్ పార్క్ లో వాకర్స్ ను, బొగ్గు వారిపై కార్మికులను కలిసి, జెన్కో వద్ద ఉద్యోగస్తులను కలిసి  విస్తృత ప్రచారం చేశారు.

 గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి పట్టభద్రులను, నిరుద్యోగుల, ఉద్యోగుల సమస్యలు ఏనాడు పట్టించుకోలేదని  పల్లాను ప్రతిఒక్కరు వ్యతిరేకిస్తున్నప్పటికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి ఉద్యమకారుడైన నన్ను ఓడించాలని కోదండరాం రెడ్డి లాంటి కొంతమంది పోటీ చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండ ఉద్యమకారునికి పట్టం కట్టడానికి పట్టభద్రులు, ప్రజా సంఘాలు జాగ్రత్త వహించాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు వీరోచిత పోరాటం చేశారని, తెలంగాణ రాష్ట్రం సాధిస్తే బొగ్గుఆ కార్మికుల జీవితాలు బాగుపడుతాయనుకుంటే గతంకన్నా దారుణంగా తయారయ్యాయని అన్నారు.   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పదాలు తెలంగాణలో వినపడకూడదని తెలంగాణ ఉద్యమంలో కేసిఆర్ ఎన్నోసార్లు అన్నాడని నేటికి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల స్థితిలో మార్పు లేకపోగా కరోనా సమయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేదని అన్నారు. మిషన్ భగీరథ ఉద్యోగస్తులను తొలిగించాడని, విద్యా సంస్థల్లో నియామకాలు లేక మొత్తం విద్య ప్రైవేట్ పరం చెసే కుట్రను పట్టభద్రులు అర్ధం చేసుకోవాలన్నారు.  తనకు మద్దతునిస్తున్న బి.సి సంఘాలు, ఎం.ఆర్.పి.ఎస్, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కు ధన్యవాదాలు తెలిపారు.

   జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రచారం ప్రారంభించి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంబేడ్కర్ సెంటర్ లో ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమానికి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పటేల్ వనజక్క అధ్యక్షత వహించగా బి.ఎల్.ఎఫ్ పార్లమెంట్ కన్వీనర్ సాయిని  నరేందర్, మండల నాయకులు మంతన వెంకటస్వామి, ద్రవిడ బహుజన సమితి సాంస్కృతిక విభాగం అధ్యక్షులు మచ్చ దేవేందర్, ఎం.ఆర్.పి.ఎస్. మండల అధ్యక్షుడు సురేష్, ఎం.ఎస్.ఎఫ్ నాయకులు విజయ్, బుల్లెట్ వెంకన్న కాళా బృందం తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు