అందరి లెక్కలు రాస్తున్నాం..మిత్తీతో చెల్లిస్తాం -మంత్రి కెటిఆర్

 బిజెపి నేతలపై ఘాటు వ్యాఖ్యలు - వాట్సప్ యూనివర్శిటి బ్యాచ్ అంటూ ఎద్దేవా 

గోడకేసిన తుపాకి కూడ మౌనంగానే ఉంటదని హెచ్చరిక


మంత్రి కెటిఆర్ బిజెపి నేతల నుద్దేశించి  ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యమంలో అడ్రస్ లేనివాళ్ళంతా కెసిఆర్ ను ఇష్టం వచ్చి నట్లు మాటలంటున్నారని, ఇవ్వాల మాట్లాడే బఫూన్ గాళ్ళకన్నా ఎక్కువగా కెసిఆర్ కు మాట్లాడే సత్తా ఉందన్నారు.

తెలంగాణ భవన్ లో శనివారం టిఆర్ఎస్ విద్యార్థి విభాగం తో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. మజిల్, మని, మీడియా ఏ పవర్ లేని కెసిఆర్ ఒంటరిగానే తెలంగాణ కోసం పోరాడారని గుర్తు చేసారు. తెలంగాణ చివరి వరకు పోరాడతానని లేదంటా రాళ్లతో కొట్టాలన్న  దమ్మున్న నాయకుడు కెసిఆర్ అని అన్నారు. కెసిఆర్ మౌనం గోడకు వేళ్లాడే తుపాకి లాంటిదని తుపాకి కూడ గోడకున్నంత సేపు  మౌనంగా ఉంటదని అన్నాడు. 

బీజేపీ నేతలకు తిట్టుడు తప్ప తెలివి లేదు..  మన్ను లేదన్నారు. సీఎంలను ఉరికించిన చరిత్ర తమ పార్టీదని.. వాళ్లను ఉరికించుడు తమకు పెద్ద లెక్క కాదన్నారు. అందరి లెక్కలు రాస్తున్నామని, మిత్తితో చెల్లిస్తామన్నారు. ఓటుకు నోటు గాడు వొర్రి వొర్రి ఖతం అయ్యాడని, కేసీఆర్‌తో పెట్టుకున్నోడు ఎవడూ బాగుపడలేదన్నారు.  బీజేపీ నేతలది వాట్సప్ యూనివర్సిటీ అంటూ ఎద్దేవా చేశారు. వాళ్లకు ఏమీ తెలియదని, కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాలలు ఇవ్వమంటే కేంద్రం ఇవ్వలేదన్నారు. దేశంలో 150 మెడికల్ కాలేజీలు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణ భారత దేశంలో లేదా? ఎందుకీ వివక్ష? ఐఐటీ, ఐఐఎంలు ఇవ్వని బీజేపీ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతుందన్నారు. బీజేపీ నేతలకు తిట్టుడు తప్ప.. తెలివి లేదు..  మన్ను లేదన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు