గొప్పలకు తప్ప ఎందుకు అక్కరకు రాని బడ్జెట్ - మాజి మంత్రి పొన్నాల లక్ష్మయ్య

 గణాంకాల గారడి హరీశ్ రావు బడ్జెట్
అసత్యాలతో కూడిన బడ్జెట్ - .అసంబద్ధ బడ్జెట్ 
గొప్పలకు తప్ప అక్కరకు రాని బడ్జెట్ 
మాజి మంత్రి పొన్నాల లక్ష్మయ్య

ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు  2021 - 22 బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాజి మంత్రి పొన్నాల క్ష్మయ్య స్పందించారు. బడ్జెట్ అంతా అర్దసత్యాలు అసత్యాలతో కూడుకున్నదని విమర్శించారు.


 

బడ్జెట్ లో గణాంకాల గారడి తప్ప మరోటి లేదన్నారు.  ప్రజలను నమ్మించడానికి.. భ్రమింప చేయడానికి.. గొప్పగా చేస్తున్నామని చెప్పుకోవడానికి తప్ప భారి బడ్జెట్ లో భారి  అంకెలు తప్ప మరేం లేదని విమర్శించారు. రెండు లక్షల 30 వేల కోట్లకు ప్రతిపాదన పెట్టారు.. ఈ బడ్జెట్లో..

రెవిన్యూ డెఫిసిటి 46 వేల కోట్లు ..46 వేల కోట్లు లేకున్నా తీసుకు వస్తాము అనే నెపంతో  రెండు లక్షల 30 వేల కోట్ల బడ్జెట్ ని పెట్టారు..వచ్చే ఆదాయ మార్గాల గురించి   చెప్ప లేదు ..

46 వేల కోట్లు డెఫిసిటి  ఉంటే.. ఎఫ్ఆర్ బిఎం కింద ఇప్పటికే మూడు లక్షల 50 వేల కోట్లు అప్పు లో ఉన్నాము.. అప్పు తీసుకోవడం ఇబ్బందవుతుందన్న సంగతి సామాన్య ప్రజలకి తెలియకపోయినా.. విశ్లేషించే వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా.. అని ప్రశ్నించారు.

భూములు అమ్మేస్తాం అని ప్రగల్భాలు పలుకుతారు ..ఈ నాలుగైదు సంవత్సరాల్లో భూములు అమ్మితే ఎంత వచ్చింది ..మీరు ప్రతిపాదించింది ఎంత..?

గత సంవత్సరం 10 వేల కోట్లు వస్తాయని చెప్పారు. నాలుగు వేల కోట్లు కూడా రాలేదు. 

46 వేల కోట్ల లోటు బడ్జెట్ తో బడ్జెట్ ప్రవేశ పెట్టి రెండు లక్షల 30 వేల కోట్ల బడ్జెట్ అని చెబుతున్నారు. అడిగే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 

ఇంత పెద్ద బడ్జెట్ ప్రవేశపెట్టి నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడ చెప్ప లేదు. 

46 వేల కోట్ల లో నిరుద్యోగ భృతి అంశం లేదు కదా ?

నిన్న ముఖ్యమంత్రి పిఆర్సి ప్రకటిస్తామని చెప్పారు..బడ్జెట్లో పిఆర్సి ప్రస్తావనే లేదు..

పిఆర్ సి కి ఎంతవుతుందో తెలుసు కదా ? 

కొన్ని వేల కోట్లు అదనంగా అవుతుంది . 

అది కూడా ఇందులో లేదు కదా..

పిఆర్ సి ఇస్తే ఇంకా ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అన్నది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది..నిరుద్యోగ భృతి  ఇస్తామని హామీ ఇచ్చారు ఇప్పటివరకు ఇవ్వలేదు ఇస్తే అది కూడా యాడ్ అవుతుంది..

దురదృష్టం ఏంటంటే ఈ బడ్జెట్లో ఎంప్లాయ్ మెంట్ గురించి మాట్లాడ లేదు.

ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ( పి ఆర్ సి రిపోర్ట్ రాకముందే ) 50 వేల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఎన్నికల కోడ్ వచ్చిందని పక్కకు తప్పుకున్నారు. పిఆర్సి రిపోర్ట్ మేరకు ఒక లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ,  రిపోర్టు రాకముందే 50వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తర్వాత ఎన్నికల కోడ్ వచ్చిందంటూ పక్కకి తప్పుకుని కాలయాపన చేస్తూ మోసం చేస్తున్నారని  మనకు తెలుసు...

మరి 50 వేల ఉద్యోగాలు ఇస్తే బడ్జెట్ ప్రభావం ఎంత పడుతుంది అన్నది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ప్రభుత్వానికి 50వేల ఉద్యోగాలు ఇచ్చే చిత్తశుద్ధి లేదని అర్థమవుతుందన్నారు.

డబుల్ బెడ్ రూమ్ ల గురించి చాలా చాలా మాట్లాడారు ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కడతారు అన్న దానిపైన ఏమైనా నెంబర్ అయినా చెప్పారా...దానికి ఎంత అని చెప్పారా చెప్పండి. 

రాష్ట్రంలో 23 లక్షల డబుల్ బెడ్ రూమ్ లు కావలసిన ..ఇప్పటికీ వేలల్లో కూడా ఇండ్లు కాలేదు..కంప్లీట్ అయిన డబుల్ బెడ్ రూములు వందల సంఖ్యలోనే ఉన్నాయి..

ఈ సంవత్సరం బడ్జెట్లో డబుల్ బెడ్ రూమ్ ల ఇళ్ల ప్రస్తావన లేదు..కేటాయింపులు కూడా లేవు.. 

ఎంత కడుపుకోత..ఎంతో కొంత భృతి సంపాదించుకునే ఉపాధి హామీ వాళ్ళని తీసేసారు.. వాళ్లకు చేసే కార్యక్రమం గురించి కూడా వీరు ఆలోచించరా.. ఆ 15 వేల మంది  కేసీఆర్ దృష్టిలో లేరు..

లక్షలాది మంది నిరుద్యోగులు మీ దృష్టిలో లేనే లేరా కేసిఆర్ అంటూ ప్రశ్నించారు.

 కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి చాలా గొప్పగా చెప్పారని ..వాళ్ళ రెగ్యులరైజేషన్ గురించి వచ్చేటప్పటికి  ఖర్చు అవుతుంది కాబట్టి రెగ్యులరైజేషన్ చెయ్యలేమని కరాఖండిగా చెప్పినట్లే కదా అన్నారు. 

దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ వరి తెలంగాణ రాష్ట్రంలో పండుతుందని 

 కెసిఆర్ గొప్పలు చెప్పారు..

అసెంబ్లీలో  ఆర్థిక శాఖ మంత్రి ఏం చెప్పారు. మీరు చెప్పిన మాట చెప్పారా.. వరి ధాన్యంలో తెలంగాణ రాష్ట్రం ఎనిమిదో స్థానంలో ఉందని చెప్పారు కదా.అసెంబ్లీలో ఆ మాట చెప్పకుండా  ప్రొక్యూర్మెంట్ గురించి చెప్పారు..

రెండు లక్షల 30 వేల కోట్ల బడ్జెట్లో 29 వేల కోట్ల కాపిటల్ బడ్జెట్ పెడితే.. అంటే 12 శాతం క్యాపిటల్ బడ్జెట్ తో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నావా కేసీఆర్...? ఉపాధి కలుగుతుంది అనుకుంటున్నావా..?

పన్నులు పెరుగుతాయ్ , అదనంగా వేస్తే తప్పా అనుకుంటున్నారా.. బడ్జెట్ లో చెప్పడం లేదు కదా ? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గితే ఏంటి..2004 2009 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే 45 - 46 శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది .

దానివల్ల ఎకనామిక్ ఆక్టివిటీ పెరుగుతుంది.. ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించ గలిగిన వారు నిపుణులు అర్థం చేసుకుంటారు..

సామాన్య ప్రజానీకానికి ఇవేమీ తెలీదు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడి ,

దీన్ని ఎట్ల ఒప్పిస్తారు కేసీఆర్..ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడారు. యూనివర్సిటీలలో ఇంకా ఎక్కడో మూత్రశాలలు కడితే ఉమెన్ ఎంపవర్మెంట్ అవుతుందా కెసిఆర్  ? 

ఒకవైపు అట్రాసిటీస్  అవుతున్నాయి .. నిర్దాక్షిణ్యంగా హత్యలు , మానభంగాలు జరుగుతున్నాయి. దాని మీద చర్యలు లేవు.. దాన్ని నిరోధించే శక్తి నీకు లేదు ..దానిపై మీకు దృష్టి లేదు.. ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడతావా..? 

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 15th కమిషన్ నిధుల తోటి ట్రాక్టర్లు ఇంకా ఏవేవో తీసుకోవాలని కంపల్సరీ చేశారు..

గ్రామాలు ,గ్రామ వార్డు మెంబర్లు ,సర్పంచులు స్వచ్ఛందంగా గ్రామస్థుల ఓటర్ల చేత ఎన్నుకోబడిన వారు ఏ పార్టీకి చెందిన వారైనా.. వారి మీద రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం ఏంటి ..? 

ఓకే కంపల్సరీ పెట్టినప్పుడు ట్రాక్టర్లు నడిపే డ్రైవర్స్ , టెక్నీషియన్లకు ఇతరులకు ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేస్తుంది..?

రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం లేదు.. ఇది వాస్తవం కాదా..?

ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా గ్రామ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు  కనపడలేదా..

ఒక గ్రామ పంచాయతీ సెక్రెటరీ కూడా నిన్న మొన్న ఆత్మహత్య చేసుకున్నాడు..

గ్రామ పంచాయతీ నిధులు మీద గ్రామ పంచాయతీలకు అధికారాలు

 ఉండాల్సిన అవసరం.. అటువంటిది.  వారి హక్కులను అధికారాలను కాలరాసి బలవంతంగా నియంతృత్వంతో చేస్తున్నారు..

ఆఖరికి చెట్లు పెడితే కూడా చెట్ల  పైసలు గ్రామ పంచాయితీ నే కట్టాలి . రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు.. చాలా గొప్పలు మాత్రం చెప్పుకుంటుంది ప్రభుత్వం..లాస్ట్ ఇయర్ 3900 కోట్లు పెట్టామని..

ఏమైంది యానిమేషన్ అండ్ గేమింగ్  ?.. 

మీ ఐటీ బడ్జెట్ లో ఏం పెట్టావ్ ? 300 కోట్లు వరకు పెట్టారు..

ఐటీ టవర్ ఏదైతే ఉందో దాని మీద 15 వేల ఉద్యోగాలు డైరెక్ట్ గా 50వేల ఉద్యోగాలు  ఇండైరెక్టు  గా వచ్చేవి..

ఏడు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం పునాది వేసిన దాన్ని పక్కన పెట్టి , ఈ సంవత్సరం కూడా పూర్తి కాలేదు..

470 కోట్ల ప్రాజెక్ట్ ను పక్కకు పెట్టేస్తే 970 అయ్యింది.. రెండు సంవత్సరాల్లో చేస్తామని చెప్పారు..

970 కోట్లు ఖర్చు పెట్టాల్సిన ప్రాజెక్టు అంటే ఈ సంవత్సరం కాదని కచ్చితంగా చెప్పినట్లే కదా..

మరి ఎందుకు ఉద్యోగాల విషయంలో  గంభీరంగా మాట్లాడుతున్నారు మీరు అని పొన్నాల లక్ష్మయ్య  ప్రశ్నించారు.

వరంగల్ లో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయని అసెంబ్లీ సాక్షిగా 250 కోట్లు కేటాయిస్తున్నామని ఆర్థికశాఖ శాఖ మంత్రి చెప్పారు..ప్రభుత్వానికి సిగ్గుండాలి..

పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  అయిన కెసిఆర్  కుమారుడు వరంగల్ వరదలప్పుడు వెళ్లి ప్రతి సంవత్సరానికి 300 కోట్లు ఇస్తామని ప్రగల్భాలు పలికారు.. ఇంతవరకు ఒక్క రూపాయి  కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు..

కనీసం ఆ మూడు వందల కోట్ల రూపాయలు కూడా ఇస్తామని చెప్పలేదు 250 కోట్లు ఇస్తామని చెప్పారు..

మీ కుటుంబ సభ్యుల తగాదాలతో వరంగల్ ప్రజలను బలి చేస్తున్నారు.  

ఇద్దరు మీ కుటుంబ సభ్యులే కదా ?పట్టణాభివృద్ధి శాఖ మంత్రి చెపుతాడు. ఆర్థికశాఖ ఇవ్వదు . ఆర్థిక శాఖ లో ఉంటది కానీ ఇప్పటివరకు ఎప్పుడూ రిలీజ్ చేయలేదు..

ప్రజలను మోసగించేందుకు అధికారాన్ని కాపాడుకునేందుకు ఎత్తుగడలతో  కాలయాపన చేస్తూ ప్రజలకు చేరువ కాకుండా .. ప్రజలతో మాట్లాడకుండా ..ప్రజలకు దూరంగా ఉంటూ ఏమేమో చేస్తున్నామని బ్రహ్మండంగా చెప్పడం  ప్రజలు గుర్తిస్తున్నారు..

ప్రజలు ముందు ఈ అన్ని అంశాలను ఉంచుతాం ..ఈ రాష్ట్రం ఈ స్థాయిలో ఉండడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు  మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు..

మీరు సరైన పద్ధతిలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేయరు ..

నిరుద్యోగులకు, ఎంప్లాయిమెంట్ ని సృష్టించడానికి చేసే కార్యక్రమానికి ఊతం  ఇవ్వాలి.. గ్రామ పంచాయతీలను ఆదుకోవాలి..

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన గ్రామ సర్పంచుల అధికారాలు తీసుకోవడం వారిపై పెత్తనం చెలాయించడం మంచిది కాదు ..

ఫీల్డ్ అసిస్టెంట్లు మంచి కార్యక్రమాలు చేశారు.. ఆదర్శ రైతులను తీసేశారు. ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ అంటే ఇదేనా .. వాళ్ల గురించి పట్టించుకోరా..

ఈ బడ్జెట్లో ఎంత పెద్దగా చెప్పారు ..నాలుగు సంవత్సరాల నుండి చూస్తున్నాము కదా...

గత బడ్జెట్ లో కేటాయించిన నిధులు ఖర్చు పెట్టారా..? 

గొప్పలు చెప్పుకోవడానికే అక్కరకొస్తుంది.. 

ఇది శాశ్వతంగా నడవదు కేసీఆర్.. ఈ ప్రభుత్వాన్ని  ప్రజలు తప్పకుండ చెంపదెబ్బ కొడతారు . అని పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు