గెలిపిస్తే ఉచిత చంద్ర మండల యాత్ర - తమిళ నాడులో ఓ అభ్యర్థి ఎన్నికల హామి

 


అధికారం కోసం ఏ హామీలైనా ఇచ్చేందుకు నేతలు సిద్ద పడుతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు రక రకాల హామీలు గుప్పిస్తున్నారు. ఎన్నికలలో పోటి పడుతున్న మక్కల్ నీతి మైయం అధినేత సిన్మా  నటుడు కమల్ హాసన్ చాలా హామీలే ఇచ్చారు. డిఎంకె, ఎఐఏడిఎంకె పార్టీలు కూడ పోటీలు పడి హామీలు ప్రకటించాయి. తమిళనాడులో ఎన్నికల హామీలు ఇవ్వడం జయలలిత కాలం నుండి మొదలైంది.

ప్రస్తుతం ఇండిపెండెంట్ అభ్యర్థిగా దక్షిణ మధురై నుంచి పోటీలో నిలిచిన శరవణన్‌ తానేం తక్కువ కాదని ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చాడు. ఆయన హామీలు చూసి అందరూ ఇవన్ని సాధ్యమేనా ఆంటు ముక్కున వేలేసుకుంటున్నారు. అయన ఇచ్చిన హామీలు వింటే ఆశ్చర్య పోక తప్పదు. తానుగెలిస్తే ఓటర్లను చంద్ర మండల యాత్రకు తీసుకు వెళతానంటూ హామి ఇచ్చాడు. ఇందు కోసం ఓ రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేయిస్తానని హామి ఇచ్చాడు. అంతే కాదు  ఇంటి పనులు చేసేందుకు ప్రతి ఇంటికి రోబోలు ఇస్తానని ప్రామీజ్ చేసాడు కూడ. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా కాల్వలు తవ్వించి ఇంటికో బోటు సౌకర్యం సమకూరుస్తానని ఎన్నికల మీద ఒట్టు పెట్టి మరి చెప్పాడు. నియోజకవర్గం ప్రజలందరికి ఐ ఫోన్లు ఇస్తానన్నాడు. వేసవిలో చల్లదనంతో ఉండేందుకు అహ్లాదంగా 300 అడుగుల ఎత్తులో మంచు కొండను నిర్మాస్తానని చెప్పాడు. కృత్రిమ సముద్రం కూడ ఏర్పాటు చేస్తానని తెలిపాడు. 

శరవరణ్ అనేక రాజకీయ పార్టీలను టికెట్ కోసం అడిగారు అయితే ఎవరూ టికెట్ ఇవ్వక పోవడంతో చివరికి ఓటర్లను ఎలా ఆకట్టుకోవడమో ఆలోచించి ఇలాంటి హామీలతో ఎన్నికలలో దిగారు.



 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు