మండు టెండల్లో కాళ్లకు చెప్పులు లేకుండా..ఉపాధి హామి కూలీలతో పనిచేసిన కలెక్టర్

 

కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్య్రాలు, దౌర్జన్యాలు, పరిష్కరించే, బహిష్కరించే, నాలో కదిలే ఆక్రోశం, కార్మిక లోకపు కల్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి..

                                             ..........అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం మధు



అధికారులు అందరూ ఒకేలా ఉండరు. ఏసి రూముల్లో కూర్చుని పునులు పురమాయించే జిల్లా కలెక్టర్లకు భిన్నంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మండు టెండల్లో కాళ్లకు చెప్పులు లేకుండా ఉపాధి హామి కూలీలతో  కల్సి గడ్డపార తో మట్టి తవ్వుతూ పని చేశారు. ఆత్మకూరు మండలం లోని వడ్డుపల్లి గ్రామం శివారులో జరిగిన ఉపాధి హామి పనుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. కూలీలలో మాట్లాడుతు వారి సమస్యలు తెల్సుకుంటూ వారితో పాటు పనిచేశారు.

కూలీలకు డబ్బులు సక్రమంగా ఇస్తున్నారా లేదా అంటు వారిని అడిగి తెల్సుకున్నారు. ఒక్కొక్కరికి రోజుకు ఎంత కూలి పడుతుోందని అడుగారు. రోజుకు 234 రూపాయల కూలి పడిందని కూలీలు తెలిపారు. 

ఫీల్డ్ అసిస్టెంట్ రామాంజనేయలుతో కలెక్టర్ మాట్లాడి వివరాలు తెల్సుకున్నారు. కరోనా పెరుగుతున్న నేపద్యంలో  పనులు జరుగుతున్న ప్రదేశాల్లో కరోనా నిభందనలు పాటించేలా చూడాలని  ఆదేశించారు. ఎండలు ముదురుతున్న కారణంగా పనులు జరిగే ప్రదేశాల్లో కూలీలకు మజ్జిగ పాకెట్లు పంపిణి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతు ఇప్పటి వరకు 2.66 కోట్ల మంది కూలీలకు ఉపాధి హామి పనులు కల్పించామని జిల్లాలో ప్రతి రోజు 6 కోట్ల నుండి 7 కోట్ల వరకు వేతనాలకింద కూలీ చెల్లిస్తున్నారని తెలిపారు.

గత రెండు రోజులుగా కలెక్టర్ జిల్లాలో ఉపాది హామిపనులు జరుగుతున్న పలు గ్రామాల్లో పర్యటించారు.  భీమ్ దీక్షలో ఉన్న కలెక్టర్ గంధం చంద్రుడు దీక్ష నియమాల మేరకు  కాళ్లకు చెప్పులు లేకుండా బ్లూ కలర్ షర్టు ధరించి దీక్ష కొనసాగిస్తున్నారు.  ఆయన ప్రధానంగా గ్రామాలలో పర్యటించినపుడు తాగు నీటి సమస్యలు ఉపాధి హామీ కూలీల సమస్యలు వారితో మాట్లాడి స్వయంగా తెల్సుకుంటున్నారు.

కలెక్టర్ ఉపాది హామిపనుల్లో గడ్డపార పట్టి తవ్వి కూలీలతో కల్సి పనిచేసిన ఫోటోలు ట్విట్టర్ లో పోస్టు చేసారు.  కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్య్రాలు, దౌర్జన్యాలు, పరిష్కరించే, బహిష్కరించే, నాలో కదిలే ఆక్రోశం, కార్మిక లోకపు కల్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి..అంటూ రాసుకొచ్చారు. All measures are being taken to provide work for the NREGA workers across the district. Nobody shall be denied from work !

అని కలెక్టర్ ట్విట్టర్ లో చేసిన పోస్టులు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు