కోచ్ ఫ్యాక్టరి సాదన కోసం హైదరాబాద్ లో నిరసన ధర్నా

 చలో హైదరాబాద్
కోచ్ ఫాక్టరీ, రైల్వే డివిజన్ సాధన ధర్నాకు తరలిన ఉద్యమ నాయకులు

 


మూడు దశాబ్దాల కళగా మిగిలిన ఖాజిపేట కోచ్ ఫ్యాక్టరీ సాధనతో పాటు ఖాజిపేట ను రైల్వే డివిజన్ చేయాలని డిమాండ్ చేస్తూ  హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ఖాజిపేట కోచ్ ఫ్యాక్టరీ, డివిజన్ పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం  జరుగుతున్న నిరసన ధర్నాకు వరంగల్ జిల్లా నుండి ప్రజా సంఘాల నాయకులు తరలివెళ్లారు. హన్మకొండ అంబేడ్కర్ సెంటర్ నుండి తరలిన ఉద్యమ నాయకులు కోచ్ ఫ్యాక్టరీ, దైల్వే డివిజన్ సాధన కోసం పోరాటం ఉదృతం చేస్తామని చెప్పారు  

 చలో హైదరాబాద్ కార్యక్రమంలో వరంగల్ పౌర స్పందన వేదిక నల్లెల్ల రాజయ్య, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ వరంగల్ పార్లమెంటు కన్వీనర్ సాయిని నరేందర్, పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు సోమ రామమూర్తి, తెలంగాణ సమరయోధుల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు నలిగింటి చంద్రమౌళి, తెలంగాణ ఆర్ టి సి ఐక్య వేదిక రాష్ట్ర కార్యదర్శి గోధుమల కుమారస్వామి, జ్యోతిరావు పూలే సామాజికన్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు కేడల ప్రసాద్, రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చాపర్తి కుమార్, తెలంగాణ ఇంటి పార్టీ జిల్లా నాయకులు దామెరకొండ కొమురయ్య, బి.సి స్టడీ ఫోరం నాయకులు సూరం నిరంజన్, తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా నాయకులు సందెల సునిల్, గోనెల దేవేందర్ తదితరులు వెళ్లారు. 

   గత 30 ఏండ్లుగా ఖాజిపేట  లో రైల్వే కోచ్ ఫ్యాక్టరి నిర్మాణం జరిగి ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ నేటికి ఫలితం లేదని, ప్రభుత్వాలు మారుతూ  పాలకుల మాటలు నీటి మూటలవుతున్నాయి తప్ప కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరగలేదని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. ఖాజిపేట రైల్వే జుంక్షన్ కు రైల్వే డివిజన్ చేయడానికి అన్నిరకాల  అర్హతలున్నాయని వారు అన్నారు. ఎన్నో త్యాగాలు చేసి సాదుంచుకున్న తెలంగాణ ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం, రైల్వే డివిజన్ సాధనలో చొరవ తీసుకోవాలని, ఉద్యమ సంఘాలతో కలిసిరావలని అన్నారు. కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం, రైల్వే డివిజన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని లేనిచో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు. కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్ సాధనకోసం ఢిల్లీ జంతర్ మంతర్ లో ధర్నాకు సిద్ధమయ్యామని అన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు