త్వరలో ఉద్యోగాల భర్తీకి నోటి ఫికేషన్ - మంత్రి హరీశ్ రావు

 అసెంబ్లీలో ప్రకటంచిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు
ఉద్యోగాల భర్తీకి పదవి విరమణ వయస్సు పెంచడం అడ్డంకి కాదన్న  మంత్రి 
పదవి విరమణ పెంచే బిల్లు తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పెన్షన్ పెంపు బిల్లు ఆమోదం


త్వరలో 50 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటి ఫికేషన్ జారి చేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు గురువారం శాసన సభలో ప్రకటించారు.

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్ మెంట్ బిల్లుతో పాటు మాజి ఎమ్మెల్యేల పెన్షన్ పెంచుతూ రెండు బిల్లుల శాసన సభ  ఆమోదించిన సందర్భంగా జరిగిన చర్చలో మంత్రి హరీశ్ రావు మట్లాడారు.

 మాజి ఎమ్మెల్యేల కనీస పెన్షన్ 50 వేల నుండి గరిష్ట పెన్షన్ 70 వేలకు పెంచుతూ బిల్లు ఆమోదించారు. గతంలో ఒకటి, రెండు, మూడుసార్లు అంతకు మించి గెలిచిన ఎమ్మెల్యేలకు 30 వేల పెన్షన్ ఇచ్చే వారు దానిని 50 వేల కు పెంచారు. అట్లాగే ఎమ్మెల్యేలు, మాజి ఎమ్మెల్యేలకు వైద్య ఖర్చల పరిమితి కూడ ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు లక్ష రూపాయల వైద్య ఖర్చుల పరిమితి ఉండేది దాన్ని 10 లక్షలకు పెంచారు.

ఎన్నికల మానిఫెస్ట్లో హామి ఇచ్చిన మేరకు ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంచామని రిటైర్ మెంట్ వయసు  పెంచడం వల్ల నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉద్యోగాల భర్తీకి ఇది అడ్డంకి కాదన్నారు. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలిచ్చారని అన్నారు. ఇందు కోసం త్వరలో నోటి ఫికేషన్ కూడ వెలువడుతుందని చెప్పారు.

రాష్ర్ట వ్యాప్తంగా విద్యార్థుల నిరసన

ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 61 ఏండ్లకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగాలు, విద్యార్థుల నుండి నిరసన వెల్లు వెత్తింది. కాకతీయ యూనివర్శిటి, ఉస్మానియాయూనివర్శిటి విద్యార్థులు నిరసనప్రదర్శనులు నిర్వహించారు. గురువారం ఉస్మానియా విద్యార్థుల ఐక్య సంఘటన కార్యచరణ కమిటి అధ్వర్యంలో విద్యార్థులు అసెంబ్లి ముట్టడికి బయలు దేరగా పోలీసులు వారిని ఆర్ట్స్ కాలేజి భవణ ంవద్ద అడ్డుకున్నారు. విద్యార్థులను పోలీసు స్టేషన్ కు తరలించారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు