అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే జగ్గా రెడ్డి నిరసన

అంబేద్కర్ విగ్రహం నుండి అసెంబ్లి వరకు పాద యాత్ర 



అసెంబ్లి సమావేశాలలో కాంగ్రేస్ పార్టీకి చెందిన  సంగారెడ్డి ఎమ్మెల్యే  జగ్గారెడ్డి కనిపించడం లేదని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే జగ్గారెడ్డి గురువారం లోయర్ టాంక్  బండ్ పై అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లే కార్డులతో  ప్రత్యక్ష మయ్యాడు. అక్కడ తన కూతురు జయారెడ్డి తో కల్సి  ప్లే కార్డులతో నిరసన ప్రదర్శన జరిపి అనంతరం అసెంబ్లీ వరకు పాద యాత్ర చేశారు. 

విధి లేకే ఇలా నిరసన తెలిపానని జగ్గారెడ్డి చెప్పారు. ఏం చెయ్య మంటారు ...అసెంబ్లీలో ఎమ్మెల్యేలను ప్రజా సమస్యలపై మాట్లాడ నీయడం లేదు...మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారు... ఎవరికి ఎక్కడ సమస్యలు చెప్పుకోవాలో అర్దం కావడం లేదు...అందుకే అంబెద్కర్ విగ్రహం వద్ద ఇలా నిరసన తెలిపానని గన్ పార్కు లోని మీడియా పాయింట్ వద్ద  జగ్గారెడ్డి మీడియాకు తెలిపాడు.

అసెంబ్లీలో కాంగ్రేస్ పార్టి ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ప్రజల సనస్యలు ఎక్కడి వక్కడే ఉన్నాయని అన్నారు.  సంగారెడ్డి లో  మెడికల్ కాలేజి మంజూరు  చేయాలని ప్రతి పాదనలు ఉండగా దానిని సిద్దపేట కు తరలించారని ఆరోపించారు. కాంగ్రేస్ అధికారంలో ఉండగా 2013 లో నియోజక వర్గంలో  5 వేల మందికి ఇళ్ళ స్థలాలు ఇస్తే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టి అధికారంలో కి వచ్చినంక పేదలను అక్కడి నుండి ఖాళి చేయించారని అన్నారు. నియోజకవర్గంలో 40 వేల మంది పేదలు ఇండ్లు లేక ఇ్బబందులు పడుతున్నారని  అన్నారు.  ఇండ్లులేని వారందరికి ఇండ్లు కట్టివ్వాలని కోరితే స్పందన లేదని నియోజకవర్గం అభివృద్ధికి 2 వేల కోట్లు ఇవ్వాలని అడిగినా పట్టించు  కోవడం లేదన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు