కర్నూలు విమానాశ్రయం ప్రారంభించిన జగన్ మోహన్ రెడ్డి


 కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నూతనంగా ఏర్పాటు చేసిన కర్నూలు విమానాశ్రయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా దీనికి నామకరణం చేశారు. విమానాశ్రయం లోనే తన తండ్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కూడ ఆవిష్కరించారు.  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో పాటు కేంద్రమంత్రి పి హర్‌దీప్‌సింగ్‌కు కూడా ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

కర్నూలు జిల్లా చరిత్రలో ఇది సుదినం. ఈనెల 28 నుంచి ఓర్వకల్లులో విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయి. ప్రారంభంలో బెంగళూరు, చెన్నై, విశాఖకు సర్వీసులు. ఒకేసారి నాలుగు విమానాలు పార్క్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. ఓర్వకల్లు విమానాశ్రయం రాష్ట్రంలో ఆరోది. న్యాయ రాజధానిని మిగతా రాష్ట్రాలతో ఓర్వకల్లు కలుపుతుంది’’ అని సీఎం వివరించారు.

 ప్రారంభంలో బెంగళూరు, చెన్నై, విశాఖకు విమానాలు అందుబాటులో ఉంటాయిని తెలిపారు. ఓర్వకల్లుతో రాష్ట్రంలో ఆరో ఎయిర్‌పోర్టు ప్రారంభమవుతోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు రిబ్బన్‌ కటింగ్‌తో హడావుడి చేసిందని, రూ.110 కోట్లు ఖర్చు చేసి కేవలం ఏడాదిన్నరలోనే పనులు పూర్తి చేశామని సీఎం జగన్‌ తెలిపారు. అధునాతన అగ్నిమాపక కూడా అందుబాటులో ఉంటుందని, ఈ గడ్డ నుంచే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వచ్చారని తెలిపారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును సీఎం జగన్‌ ప్రకటించారు.

ఇండిగో సంస్థ ఈనెల 28 నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు కర్నూలు నుంచి సర్వీసులు నడపనుంది. 1,008 ఎకరాల్లో రూ.153 కోట్లతో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి చేశారు. విమాన సర్వీసులు ప్రాంభించడానికి డీజీసీఏ ఈ ఏడాది జనవరి 15న లైసెన్స్‌ జారీ చేయగా.. బీసీఏఎస్‌ సెక్యూర్టీ క్లియరెన్స్‌ జనవరి 27న మంజూరైంది. 2,000 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పులో ఇక్కడి రన్‌వేను అభివృద్ధి చేశారు. నాలుగు విమానాలకు పార్కింగ్‌తో పాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించారు.



గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం మూడు విభాగాలుగా ఉంటుందని అధికారులు తెలిపారు. మొదటి విభాగం ప్రతిపాదిత అప్రాన్‌. అందులో ఎనిమిది విమానాలు నిలిపేందుకు అవకాశం ఉంటుంది. మరమ్మతులకు గురైన విమానాలకు నిలయంగా ఐసోలేషన్‌ అప్రాన్‌ ఏర్పాటు చేశారు. అందులో మూడు విమానాలను నిలపవచ్చు. భవిష్యత్తులో విమానాల రాకపోకల రద్దీ పెరుగుతుందన్న ఉద్దేశంతో ఫ్యూచర్‌ అప్రాన్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం రూ.7 కోట్లతో నైట్‌ ల్యాండింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసింది. రూ.18 కోట్లతో అత్యాధునిక అగ్నిమాపక శకటాలను అందుబాటులో ఉంచారు. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గౌతంరెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు