ట్రాఫిక్ చలాన్లు చెల్లించనివారిపై చర్యలు తప్పవు


వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్

 


వాహనదారులు తమ వాహనంపై పెండింగ్ లో వున్న ట్రాఫిక్ చలాన్లను చెల్లించని వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని 

 ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించిన వాహనాలపై విధించిన ట్రాఫిక్ చలాన్లను వాహనదారులు తక్షణే చెల్లించాలని లేదంటే సదరు వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని తెలియజేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం పత్రికా ప్రకటనను విడుదల చేసారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణతో పాటు, రోడ్డు ప్రమాదాలను నివారణలో భాగంగా ట్రాఫిక్ నియమాలను అతిక్రమించి వాహనాలను నడిపే వాహనదారులపై వరంగల్ పోలీస్ కమిషనరేటకు చెందిన ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు కాంటాక్ట్, నాన్ కాంటాక్ట్ విధానంతో వాహనాలపై జరిమానా విధించి వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లను జారీచేయబడుతోంది. ఇలా జారీ చేయబడిన ట్రాఫిక్ చలాన్లతో సదరు వాహనాలపై వేల రుపాయాల ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో వుంటున్నాయి. ఈ విధంగా పెండింగ్ లో వున్న చలాన్లను వాహనదారుల నుండి వసూలు చేసేందుకు గాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో

ట్రాఫిక్ పోలీసులు మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు రోడ్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించబడుతోందని. ఈ తనీఖీల్లో చలాన్లు పెండింగ్ వున్న వాహనాలను గుర్తించి పెండింగ్ ట్రాఫిక్ జరిమానాలను వసూలు చేయబడుతున్నాయిని. నిన్నటి రోజున ప్రారంభమయిన ఈ వాహన తనిఖీల్లో వరంగల్, ఖాజీపేట, హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో 95 వాహనాలకు సంబంధించి మొత్తం 399 పెండింగ్ చలాన్లను గుర్తించి మొత్తం ఒక లక్ష 34వేల రూపాయల జరిమానాలను వసూలు చేయడం జరిగిందని. ఇకనైన వాహనదారులు పెండింగ్ చలాన్లను తక్షణమే చెల్లించాలని ఇలా పెండింగ్ జరిమానాలు చెల్లించకుండా వాహనదారులు ఆలసత్వం వహించే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని. ముఖ్యంగా వాహనదారులు తమ వాహనంపై ఎమైనా ట్రాఫిక్ జరిమానాలు వున్నాయో లేదో తెలుసుకోనేందుకుగాను https://echallan.tspolice.gov.in అనే వెబ్ సైడ్ లో తెలుసుకోవచ్చని. ఒక వేళ చాలాన్లు పెండింగ్ లో వున్నట్లయితే పేటియం లేదా సమీప మీ సేవా కేంద్రం ద్వారా జరిమానాలు చెల్లించవచ్చని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.

*తప్పుగా వచ్చిన ట్రాఫిక్ చలాన్లపై అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు*


ట్రాఫిక్ నియంబంధనలు అతిక్రమించిన వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు నాన్ కాంటాక్ట్ పద్దతి ద్వారా వాహనాలపై జరిమానాలను విధించడం జరుగుతోంది. దీనితో కొద్ది వాహనదారులు ట్రాఫిక్ జరిమానాలు తప్పించుకోనేందుకుగాను ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించిన తమ వాహనంపై వున్న నంబర్ ప్లేట్ లోని రిజిస్ట్రేషన్ క్రమ సంఖ్యలో అంకేలుగాని లేదా అంగ్ల అక్షరాలను స్వయంగా మార్పు చేయడం ద్వారా ట్రాఫిక్ పోలీసులు నాన్ కాంటాక్ట్ పద్ధతిలో జరిమానాలు విధించే సమయంలో ట్రాఫిక్ నియమాలను అతిక్రమించిన వాహనదారుడికి బదులు మరో వాహనదారుడి ట్రాఫిక్ జరిమానా విధించినట్లుగా సమచారం తమ సెల్ ఫోన్లకు రావడంతో సదరు వాహనదారులు కంగారుకు గురౌవుతున్నారు. ఇలా తప్పుగా వచ్చిన ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి వాహనదారులు మీ

జారీ అయిన చలానులోని నంబర్ కు వాహనదారులు ఫిర్యాదు చేయవచ్చును. ఇలా వచ్చిన పిర్యాదుపై సంబంధిత పోలీసులు త్వరితగతిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ వాహనదారులకు తెలియజేసారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు