మరో సారి లాక్ డౌన్ విధించ బోం - అసెంబ్లీలో ప్రకటించిన సిఎం కెసిఆర్

 లాక్ డౌన్ వల్ల గతేడాది చాలా నష్ట పోయాం..తొందరపడి లాక్ డౌన్ పెట్టబోం...ఎట్టి పరిస్థితిలో లాక్ డౌన్ విధించ బోం


కరోనా కేసులు రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న నేపద్యంలో మరో సారి లాక్ డౌన్ విధిస్తారంటూ వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం అసెంబ్లీలో స్పష్టత నిచ్చారు. బడ్జెట్ పై కొనసాగుతున్న చర్చలో బాగంగా సిఎం. కెసిఆర్ మాట్లాడుతు  లాక్ డౌన్ విషయంలో ఎలాంటి భయాందోళనలు అవసరం లేదన్నారు.  " లాక్ డౌన్ వల్ల గతేడాది చాలా నష్ట పోయాం..తొందరపడి లాక్ డౌన్ పెట్టబోం...ఎట్టి పరిస్థితిలో లాక్ డౌన్ విధించ బోమంటూ"  సిఎం స్పష్టం చేసారు.

అయితే కరోనానియంత్రణకు పకడ్పంది చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరు విధిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తే  కరోనాను నియంత్రించడం సాధ్యమన్నారు.  పాఠశాలలు మూసి వేయడంపై ఆందోళనలువ్యక్తం అవుతున్నాయని  బాదతోనే   తాత్కాలికంగా మూసి వేయక తప్పలేదనే విషయం ప్రతి ఒక్కరు గమనించాలని అన్నారు. పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని  పాఠశాలలు మూసి వేసామని చెప్పారు.  క్రితం రోజు 70 వేల మందికి కరోనా టెస్టులు నిర్వహించామని తెలిపారు. కరోనా నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు చేపట్టిందని తెలిపారు.

సినిమా ధియేటర్ల విషయంలో యాజమాన్యాలకు కొన్ని వెసులు బాట్లు కల్పించామని తెలిపారు. కేంద్ర నిభందనలకు అగుగుణంగా ధయేటర్లు నడుస్తాయని వివరంచారు. 

ఏడాది కాలంగా అంతుపట్టని  కరోనా మహమ్మారి కారణంగా మనం ఒక్కరమే కాకుండా   ప్రపంచం అంతా అతలాకుతలం అయిందన్నారు. అన్ని దేసాల జిడిపీలు కుప్పకూలాయని అన్నారు. అయితే మన రాష్ట్రం జిడీపీలో మెరుగ్గా ఉందని చెప్పారు. కరోనా సమయంలోను సంక్షేమం ఆగలేదన్నారు. రాష్ట్రంలో అప్పులు పెరగలేదని ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వడం లేదని  ప్రతి దాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని  రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోందని  రిజర్వేషన్లు రాష్ట్రాలకే వదిలేయాలని కోరామని త్వరలో 57ఏళ్లు దాటిన వారికి వృద్ధాప్య పెన్షన్లు ఇస్తామని తెలిపారు.  రాష్ట్రంలో ఇప్పటి వరకు 10.85 లక్షల మందికి వాక్సినేషన్ చేశామని తెలిపారు. 

వాక్సి నేషన్ ఇచ్చే అంశం కేంద్రం పరిదిలో ఉందని డోసుల తయారీని దృష్టిలో ఉంచుకుని కేంద్రం రాష్ట్రాలకు వాక్సిన్ సరఫరా చేస్తుందని అందరికి వాక్సినేషన్ జరిగేలాఅన్ని చర్యలు తీసుకుంటామని సిఎం వివిరంచారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు