సచిన్ కు శరద్ పవార్ చురకలు

రైతుల దీక్షలపై సెలబ్రెటీల స్పందన పై విమర్శలు


సచిన్ టెండూల్కర్ క్రికెట్ రంగంలో మహ గొప్ప క్రికెటరే కావచ్చు కాని రైతుల దీక్ష విషయంలో ఆయన చేసిన ట్వీట్ విమర్శల పాలైంది.. మా దేశ అంద్రగత విషయాల్లో వేలుపెట్టడం తగునా ఆంటూ విదేశి సెలబ్రెటీలకు కౌంటర్ గా సచిన్ ట్వీట్ చేసారు. పాప్‌సింగర్‌ రిహానా, పర్యవరణ కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్‌, మియా ఖలీఫాల తదితరులు రైతు దీక్షలకు మద్దతు పలకడం తప్పు పడుతూ ఇండియన్ సెలబ్రెటీలు రంగంలోకి దిగడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. రైతుల దీక్ష ఇండియాలో ఉన్న సెలబ్రెటీలను రెండు గా చీల్చింది. రైతులకు మద్దతుగా కొందరు వ్యతిరేకంగా కొందరు నిలిచారు. సెలబ్రెటీలు అన్న దాతలను వదిలి సర్కార్ కు మద్దతుగ నిలవడం ఏమిటని నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. సచిన్ ను అభిమానించే వారు కూడ ఇదేం బాగా లేదంటూ అసంతృప్తి  వ్యక్తం చేశారు.

నేషనల్ కాంగ్రేస్ పార్టి అధినేత శరత్ పవార్ కూడ సచిన్ ట్వీట్ పై స్పందిస్తు చురకలువేశాడు. ఏదైనా అంశంపై సెలబ్రెటీలు మాట్లాడేటపుడు పూర్తి వివరాలు అవగాహన చేసుకుని మాట్లాడితే బాగుంటుందని అన్నారు. దేశంలోని చాలామంది సెలబ్రిటీల తీరుపై చర్చించుకుంటున్నారని, పూర్తి వివరాలను తెలుసుకుని స్పందిస్తే మంచిదని హితవు పలికారు. ఈ మేరకు శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన శరద్‌ పవార్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఇదే విషయంపై ఎమ్మెన్నెస్‌ చీఫ్‌ రాజ్‌ఠాక్రే సైతం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సచిన్‌ టెండూల్కర్, గాయని లతా మంగేష్కర్‌ల ప్రతిష్టను వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం పణంగా పెట్టిందని ఆయన ఆరోపించారు. సచిన్, లతా మంగేష్కర్‌లు వారివారి వృత్తిలో గొప్ప పేరు, ప్రఖ్యాతలు సంపాదించారని, కానీ, కొద్దిరోజుల కిందట వారు పెట్టిన పోస్టుల కారణంగా సోషల్‌ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు