కీలోంకా జవాబ్ ఫూలోంసే - వినూతన రీతిలో రైతుల గాంధి గిరి

 మేకులు కొట్టిన రహదారి పై  రైతుల పూల మొక్కలు

ఇనుప మేకులకు పూలతో సమాధానం చెప్పిన రైతులు


కేంద్రం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత రెండు నెలల నుండి పోరాటం చేస్తున్న రైతులు గాంధిగిరి పద్దతిలో వినూతన నిరసన చేపట్టారు. రైతులు సరిహద్దులు దాటి ఢిల్లీ వైపు రాకుండా ఘజిపూర్ బార్డర్ వద్ద పోలీసులు అంచల వారీగా బార్బుడ్ వైర్లతో, ఇనుప గేట్లతో ఫెన్సింగ్ ఏర్పాటు చేసారు. రహదారిపై ఇనుప కీలలు కొట్టారు. ఇందుకు నిరసనగా రైతులు గాంధి గిరి పద్దతిలో  అదే చోట  భారి ఎత్తున పూల మొక్కలు నాటారు.  

సరిహద్దులలో ఉన్న శిబిరాల నుండి రైతులను వెళ్ళగొట్టేందుకు  పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. శిబిరాలకు మంచి నీటి సరఫరా నిలిపి వేశారు. విద్యుత్ సౌకర్యం కూడ లేకుండా చేసారు. ఆందోళన శిభిరాల పరిసరాలలో ఇంటర్ నెట్ లేకుండా చేసారు. అయినా రైతులు వెనుకడుగు వేయకుండా పోరాటం కొనసాగిస్తున్నారు. రైతులు పోరాటానికి మద్దతుగా  శనివారం దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరగడంతో సరిహద్దుల్లో పోలీసులు నిఘా తీవ్రం చేశారు. 

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో  రైతులకు మద్దతుగా జాతీయ రహదారులపై  రాస్తారోకోలు జరిగాయి. ఈసందర్భంగా కొన్ని చోట్ల పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా వామ పక్షాల నేతలను అరెస్ట్ చేశారు. 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో కాంగ్రేస్, ఉభయ కమ్యునిస్టు పార్టీల అధ్వర్యంలో జాతీయ రహదారులపై నిరసన తెలుపగా పోలీసులు అరెస్ట్ చేసారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు