సిఎం వార్తలకు బ్రేక్ - కెటిఆర్ అనుచరులకు షాక్

 కెటిఆర్ ను సిఎం ను చేస్తే తప్పేంటని పోటీలు పడి ప్రకటనలు చేసిన  ముఖాలన్ని బిక్క బోయాయి


రాష్ట్రంలో సిఎం మార్పిడి పై వచ్చిన ఉహాగాన వార్తలకు సిఎం కెసిఆర్ బ్రేక్ వేశారు. కెటిఆర్ సిఎం కాబోతున్నాడంటూ గంతులేసిన కెటిఆర్ అనుచరులకు షాక్ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో చాలా రోజుల తర్వాత జరిగిన పార్టి కార్యకవర్గ సమావేశంలో కెసిఆర్ కుండ బద్దలు కొట్టారు. తానే మరో 10 ఏళ్ళు సిఎం ను  అంటూ  గతంలో నిండు అసెంబ్లీలో మాట్లాడి విదంగానే పార్టి కార్యవర్గ సమావేశంలో కూడ క్లారిటీ ఇస్తూ తాను సంపూర్ణంగా  ఆరోగ్యంతో  ఉన్నానని తానే మరో 10 ఏళ్ళు సిఎంను అంటూ పార్టి సమావేశంలో  ప్రకటించారు. 

 అనవసరంగా ఎవరూ ఇష్టారీతిన  మాట్లాడ వద్దని కేసిఆర్ హెచ్చరించారు. ‘వాళ్లు ముఖ్యమంత్రి. వీళ్లు సీఎం అని నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. నేను సీఎంగా ఉంటే మీకు నచ్చుత లేదా?’ అని సీఎం కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు మీద కూడా కేసీఆర్ సీరియస్ అయ్యారు. జిల్లాల్లో పార్టీ నేతలు ఒకరిపై మరొకరు ఆధిపత్యం కోసం పోటీ పడడం  అవతలి వారి పనులకు బ్రేక్ వేసేలా చూడడం వంటి పనులు చేయవద్దని కోపగించారు. 

పార్టి సమావేశంలో పార్టి శ్రేణులు అంతా సిఎం కెసిఆర్ నోట ఈ మాట కోసమే పొద్దంతా ఉత్కంఠతో ఎదురు చూశారు. పార్టీకి హాజరైన నేతలు కెటిఆర్ కు అడ్వాన్సు కంగ్రాచ్యు లేషన్స్ కూడ చెప్పారు.  అయితే సమావేశంలో పలు కీలక అంశాలపై మాట్లాడిన కెసిఆర్ చివరాఖరికి ఈ విషయం కాస్త వెల్లడించారు. దాంతో పార్టి శ్రేణులు తాము ఊహించుకున్నట్లుగా కెసిఆర్ నోటి నుండి ప్రకటన రాక పోవడంతో ఢీలా పడ్డారు. 

ఏప్రిల్‌లో 6 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని సమావోశంలో పార్టీ నిర్ణయించింది. ఏ జిల్లా వాళ్ళు ముందుకు వస్తే అక్కడే సభ నిర్వహిద్దామని సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు. ప్రతి ఎమ్మెల్యే 50 వేలమంది సభ్యత్వం నమోదు చేయించాలని సూచించారు.

త్వరలో జరగబోయే ఎమ్మెల్సి ఎన్నికలతో పాటు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు  మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల విషయం కూడ కెసిఆర్ ప్రస్తావించారు.ఎన్ని ఎన్నికలలో విజయం మానదే నని కెసిఆర్ కార్యకర్తలకు భరోసా ఇచ్చాడు. 

జిహెచ్ఎంసి మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నికల రోజే సీల్డు కవర్లలో అభ్యర్థుల పేర్లు అంద చేస్తామన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు