రామ మందిరం నిర్మాణానికి విరాళాల మొత్తం ఎంతో తెల్సా ?



అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం నిర్మాణానికి దేశ వ్యాప్తంగా రామ  భక్తులు ఉత్సాహం చూపారు. నెల పది రోజులకు పైగా కొనసాగిన  విరాళాల సేకరణలో జై శ్రీ రాం అంటూ భక్తులు తమకు తోచిన విదంగా విరాళాలు అంద చేసి భక్తిని చాటుకున్నారు. చిన్నపిల్లలు మొదలు కృష్ణా, రామా అంటూ జపంతో కాలం గడిపే వయస్సు పైబడిన వృద్ధులు సైతం తాము దాఛుకున్న డబ్బులను శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కు అంద చేశారు.

మొత్తం 44 రోజుల పాటు కొన సాగిన  విరాళాల సేకరణ ముగిసిందని  శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రకటించింది. ఇప్పటివరకు ప్రాథమికంగా లెక్కించిన విరాళాల మొత్తం 2 వేల కోట్లను దాటింది. ఈ విషయం ట్రస్టు స్వయంగా  ధృవీకరించింది.  ఇంకా నగదు పూర్తిగా బ్యాంకుల లో డిపాజిట్ చేయాల్సి ఉంది.బ్యాంకులలో డిపాజిట్ పూర్తి అయితే మొత్తం విరాళం లెక్క తేలుతుందని భావిస్తున్నారు. 

విరాళాల రూపంలో అందిన నగదు మొత్తానికి ఆడిటింగ్ నిర్వహిస్తామని  శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు  కార్యాలయం ఇన్చార్జి  ప్రకాష్ గుప్తా తెలిపారు. ఇందు కోసం ఆడిటింగ్ నిర్వహించేందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్ సిద్దం చేసినట్లు తెలిపారు.  ఆడిటింగ్ లో పాల్గొన గోరు వారంతా అక్కౌంట్ లో లాగిన్ కావచ్చని నెల రోజుల పాటు ఆడిటింగ్ జరుగుతుందని ఆ తర్వాత పూర్తి వివరాలు  రామ భక్తులకు వెల్లడిస్తామని చెప్పారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు