స్మృతివనం లో సార్ బొమ్మలు తక్కువ కెసిఆర్ వే ఎక్కువ

 వెల్లువెత్తుతున్న విమర్శలు


వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని హన్మకొండ లో గల ఏకశిల పార్కును తెలంగాణ మహోపాధ్యాయుడు డాక్టర్ జయశంకర్ సార్ స్మృతివనంగా మార్చే పనులు 2016 లో ప్రారంభమయ్యాయి. అయితే ఇందులో  జయశంకర్ సార్ కన్నా ముఖ్యమంత్రి, కెసిఆర్, ఆయన కుమారుడు కెటిఆర్ బొమ్మలే ఎక్కువగా వేశారని విమర్శలు వెల్లువెత్తాయి. 

వెలుగు దినపత్రిక దీనికి సంభందించిన ఓ వార్త కథనం (27-02-2021) ప్రచురించింది. జయశంకర్ సార్ తో పాటుగా తండ్రి కొడుకుల చిత్రాలు కూడ వనంలో ఓ కుడ్యంపై  తీర్చి దిద్దారు. జయశంకర్ సార్ తో కెసిఆర్ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారంటే సరే కాని అసలు ఉద్యమంలోసార్ పక్కన కెటిఆర్ ఎక్కడి నుండి వచ్చాడంటూ తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు.

కాంగ్రేస్ నేత రేవంతర్ రెడ్డి  వెలుుద దిన పత్రిలకలో వచ్చిన వార్త ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. తెలంగాణ‌ ఉద్యమానికి జయశంకర్ చేసిన సేవలను గుర్తు చేసుకోవాల్సిన చోట ఆయన కంటే సీఎం కేసీఆరే ఎక్కువగా కనిపించేలా బొమ్మలు పెట్టారని అందులో ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు. అంతేగాక‌, తెలంగాణ‌ పోరాటాన్ని పక్కనపెట్టేసి కేసీఆర్ దిక్షాదివస్ లో  నిమ్మరసం తాగే చిత్రాన్ని పెట్టార‌ని చెప్పారు.

మ‌రికొంచెం ముందుకు వెళ్లి  జయశంకర్ తో ఎప్పుడూ వేదికన పంచుకోని మంత్రి కేటీఆర్ చిత్రాన్ని కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. ఉద్యమ ఘట్టాలకు సంబంధించిన చిత్రాల్లో జయశంకర్  కంటే సీఎం కేసీఆర్ బొమ్మలే పెద్దగా పెట్టారని అందులో పేర్కొన్నారు.  వీటిని రేవంత్ రెడ్డి ప్ర‌స్తావించారు. 

'త్యాగాల చరిత్రకు భోగాల చెద! స్వరాష్ట్రం కోసం ప్రాణం ఒదిలినోళ్లు, ప్రాణం పెట్టినోళ్ల చరిత్ర చిన్నబోతోంది. ఉద్యమ మార్గదర్శి జయశంకర్ ‘సారు’ ఒక్కడికే  జరిగిన పరాభవం కాదు ఇది. రాష్ట్రమే కాంక్షగా... ఉద్యమమే శ్వాసగా బతికిన ప్రతి తెలంగాణ బిడ్డకు జరిగిన అవమానం. ఎవని పాలయిందిరో తెలంగాణ...?' అని రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.


 త్యాగాల చరిత్రకు భోగాల చెద!స్వరాష్ట్రం కోసం ప్రాణం ఒదిలినోళ్లు,ప్రాణం పెట్టినోళ్ల చరిత్ర చిన్నబోతోంది.ఉద్యమ మార్గదర్శి జయశంకర్ ‘సారు’ ఒక్కడికే జరిగిన పరాభవం కాదు ఇది. రాష్ట్రమే కాంక్షగా... ఉద్యమమే శ్వాసగా బతికిన ప్రతి తెలంగాణ బిడ్డకు జరిగిన అవమానం. ‘ఎవని పాలయిందిరో తెలంగాణ...? pic.twitter.com/qiG132B0qO

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు